Thalapathy Vijay - Jason Sanjay: తండ్రి ఫ్యాన్స్‌కు ఝలక్‌ ఇచ్చిన స్టార్ కొడుకు జేసన్ సంజయ్.

Thalapathy Vijay – Jason Sanjay: తండ్రి ఫ్యాన్స్‌కు ఝలక్‌ ఇచ్చిన స్టార్ కొడుకు జేసన్ సంజయ్.

Anil kumar poka

|

Updated on: Feb 23, 2024 | 2:22 PM

సినిమా నటుల పిల్లలు సినిమా నటులుగా మారడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.. తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ తనయుడు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. రెండేళ్ల క్రితం దళపతి విజయ్ కొడుకు సినిమా రంగ ప్రవేశం గురించి వార్తలు వచ్చాయి, విజయ్ సేతుపతి విజయ్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవలి వార్తల ప్రకారం దళపతి విజయ్ తనయుడు తన తండ్రిలా...

సినిమా నటుల పిల్లలు సినిమా నటులుగా మారడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం.. తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ తనయుడు కూడా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. రెండేళ్ల క్రితం దళపతి విజయ్ కొడుకు సినిమా రంగ ప్రవేశం గురించి వార్తలు వచ్చాయి, విజయ్ సేతుపతి విజయ్ కొడుకును ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇటీవలి వార్తల ప్రకారం దళపతి విజయ్ తనయుడు తన తండ్రిలా నటుడిగా మారకుండా దర్శకుడిగా మారుతున్నాడట. దళపతి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ సినిమా డైరెక్టర్ కావాలని కలలు కంటున్నాడట. దాని కోసం సన్నాహాలు ప్రారంభించాడు. గతంలో జాసన్ తన తండ్రితో కలిసి కొన్ని సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించాడు. అయితే జేసన్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడని అంతా భావించారు. అయితే జేసన్ ఆసక్తి నటన కంటే దర్శకత్వంపైనే ఎక్కువ ఉందట. దాంతో జేసన్‌ సంజయ్ తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. తన మొదటి సినిమాకు హీరోగా స్టార్ నటుడ్ని ఎంపిక చేసుకున్నాడట. విజయ్ కొడుకు కథతో సినిమా తీస్తామని లైకా ప్రొడక్షన్స్ గతంలోనే ప్రకటించింది. అప్పటి నుంచి ఈ సినిమాలో నటించే నటీనటులపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. మరో తమిళ స్టార్ నటుడు విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా.. విజయ్ సేతుపతి విలన్ పాత్రలో నటించనున్నాడని వార్తలు వచ్చాయి. కానీ విజయ్ కొడుకు తన మొదటి చిత్రానికి పాన్ ఇండియా స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్‌ను ఎంచుకున్నాడనే టాక్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో రన్ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..