AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saripodhaa Sanivaaram: నాని బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. ‘సరిపోదా శనివారం’ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..

గతంలో నాని ప్రధాన పాత్రలో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ హిట్ తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందులో నాని జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఇక ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి ?.. వరుస హిట్స్ అందుకుంటున్న నాని.. మరోసారి ఎలాంటి కంటెంట్ తో అలరించేందుకు రెడీ అయ్యాడు

Saripodhaa Sanivaaram: నాని బర్త్ డే ట్రీట్ వచ్చేసింది.. 'సరిపోదా శనివారం' గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే..
Saripodhaa Sanivaaram
Rajitha Chanti
|

Updated on: Feb 24, 2024 | 2:03 PM

Share

అష్టా చమ్మా సినిమాతో హీరోగా మారి.. దసరా మూవీతో పాన్ ఇండియా స్టార్‏గా క్రేజ్ అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ తర్వాత ఇటివలే హాయ్ నాన్న సినిమాతో మరోసారి ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇందులో మళ్లీ తండ్రి పాత్రలో కనిపించి నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడు నాని నటిస్తోన్న సినిమా ‘సరిపోదా శనివారం’. గతంలో నాని ప్రధాన పాత్రలో అంటే సుందరానికి లాంటి క్లాసిక్ హిట్ తీసిన డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. ఇందులో నాని జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుంది. ఇక ఎస్జే సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటిని పెంచాయి. అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి ?.. వరుస హిట్స్ అందుకుంటున్న నాని.. మరోసారి ఎలాంటి కంటెంట్ తో అలరించేందుకు రెడీ అయ్యాడు అనే విషయాలను తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.

ఈరోజు (ఫిబ్రవరి 24)న నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘సరిపోదా శనివారం’ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘కోపాలు రకరకాలు.. ఒక్కో మనిషికి కోపం ఒక్కో రకంగా ఉంటుంది. కానీ ఆ కోపాన్ని క్రమబద్ధంగా.. పద్దతిగా వారంలో ఒక్కరోజు మాత్రమే చూపించే పిచ్చినా కొడుకుని ఎవరైనా చూశారా ? నేను చూశా. పేరు సూర్య.. రోజు .. శనివారం’ అని పవర్ ఫుల్ గా ఎస్జే సూర్య వాయిస్‏తో వీడియో స్టార్ట్ అయ్యింది. ఈరోజు రిలీజ్ అయిన గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది.

తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే.. ఈ మూవీ మాస్ కమర్షియల్ సినిమాలా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్ 29న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. హాయ్ నాన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న నాని.. ఇప్పుడు సరిపోదా శనివారం మూవీతో మరోసారి హ్యాట్రిక్ హిట్ అందుకుంటాడని తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.