AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha Naa Pellanta: ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఇప్పుడు టీవీలో.. అహనా పెళ్లంట టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?

ఈ సిరీస్ కథ మొత్తం శీను (రాజ్ తరుణ్) చుట్టూ తిరుగుతుంది. స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు శీను. కానీ అనుకోకుండా మహా(శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది. తర్వాత ఊహంచని ట్విస్ట్ లతో కథ మలుపు తిరుగుతుంది.

Aha Naa Pellanta: ఓటీటీ సూపర్ హిట్ వెబ్ సిరీస్ ఇప్పుడు టీవీలో.. అహనా పెళ్లంట టెలికాస్ట్ ఎప్పుడు, ఎక్కడంటే?
Aha Naa Pellanta Web Series
Basha Shek
|

Updated on: Feb 24, 2024 | 1:09 PM

Share

ఈ లీపు సంవత్సరాన్ని మరింత స్పెషల్‌ గా మార్చేందుకు ఫిబ్రవరి 29న ప్రేక్షకులకు అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వడానికి జీ తెలుగు సిద్ధమైంది.సరికొత్త సూపర్ హిట్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఇప్పుడు జీ 5 ఒరిజినల్ వెబ్ సిరీస్ -అహ నా పెళ్లంట మొత్తం సీజన్ ను సినిమాగా అందించనుంది. జీ5లో అత్యధికంగా వీక్షించిన ఈ తెలుగు సిరీస్ ఫిబ్రవరి 29 గురువారం మధ్యాహ్నం 12 గంటలకు జీ తతెలుగు ఛానెల్ లో ప్రసారం కానుంది. ప్రముఖ ఓటీటీ జీ5 వేదికగా వీక్షకులను ఆకట్టుకున్న సూపర్ హిట్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంట బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు ఛానెల్‌ ప్రసారం కానుంది. ఓ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన కథను ఓ పెద్ద ట్విస్ట్ తో చెప్పే కథే అహ నా పెళ్లంట. ఈ సిరీస్ కథ మొత్తం శీను (రాజ్ తరుణ్) చుట్టూ తిరుగుతుంది. స్కూల్లో జరిగిన సంఘటనతో జీవితంలో ఏ అమ్మాయిని చూడనని తండ్రికి మాటిస్తాడు శీను. కానీ అనుకోకుండా మహా(శివానీ రాజశేఖర్) శీను జీవితంలోకి వస్తుంది. తర్వాత ఊహంచని ట్విస్ట్ లతో కథ మలుపు తిరుగుతుంది. అసలు శీను స్కూల్లో జరిగిన సంఘటన ఏంటి? మహా, శీను జీవితాన్ని మారుస్తుందా? వీటికి సమాధానాలు తెలియాలంటే జీ తెలుగులో సినిమాగా ప్రసారం కానున్న అహ నా పెళ్లంట సిరీస్ చూడాల్సిందే.

జీ5 ఒరిజినల్ వెబ్ సిరీస్ అహ నా పెళ్లంటలో హీరో రాజ్ తరుణ్ తల్లిగా ప్రముఖ నటి ఆమని నటించగా, నటుడు హర్షవర్ధన్ తండ్రి పాత్రలో నటించారు. పోసాని కృష్ణ మురళి, మహ్మద్ అలీ బేగ్‌, వడ్లమాని శ్రీనివాస్‌, రఘు కారుమంచి, మధు నందన్, దీపాలి శర్మ, తాగుబోతు రమేశ్‌, గెటప్ శీను, భద్రం తదితరులు వివిధ పాత్రల్లో మెరిశారు. భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందిన ఈ సినిమాకు సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అహ నా పెళ్లంట ఈ గురువారం మీ ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

సిరీస్ మొత్తం సినిమాలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.