Brahmamudi, February 24th episode: అప్పూకి గురూజీ సహాయం.. ఇందిరా దేవి, భాస్కర్‌ల కొత్త ప్లాన్!

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని మెప్పించడానికి రాజ్ కావాలనే హెచ్చుకు పోయి.. పద్మాసనం వేసి నడుము నొప్పితో మూలుగుతూ మంచం మీద పడుకుంటాడు. రాజ్‌ని అలా చూసిన కావ్య.. ఎందుకండీ మరి మా బావ ముందు గొప్పలకు పోయి తంటాలు తెచ్చుకోవడం అని అంటుంది. మీ బావ ముందు గొప్పగా చూపించుకునేందుకు నేనేమీ చేయలేదు. చాలా రోజులు అయింది కదా ఆసనాలు వేసి.. అలవాటు తప్పిందని రాజ్ సీరియస్‌గా అంటాడు. సరే గుర్రం ఎక్కనా అని కావ్య అంటే..

Brahmamudi, February 24th episode: అప్పూకి గురూజీ సహాయం.. ఇందిరా దేవి, భాస్కర్‌ల కొత్త ప్లాన్!
Brahmamudi
Follow us
Chinni Enni

|

Updated on: Feb 24, 2024 | 11:56 AM

ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. కావ్యని మెప్పించడానికి రాజ్ కావాలనే హెచ్చుకు పోయి.. పద్మాసనం వేసి నడుము నొప్పితో మూలుగుతూ మంచం మీద పడుకుంటాడు. రాజ్‌ని అలా చూసిన కావ్య.. ఎందుకండీ మరి మా బావ ముందు గొప్పలకు పోయి తంటాలు తెచ్చుకోవడం అని అంటుంది. మీ బావ ముందు గొప్పగా చూపించుకునేందుకు నేనేమీ చేయలేదు. చాలా రోజులు అయింది కదా ఆసనాలు వేసి.. అలవాటు తప్పిందని రాజ్ సీరియస్‌గా అంటాడు. సరే గుర్రం ఎక్కనా అని కావ్య అంటే.. గుర్రం మీద గాడిద కూర్చుంటే బాగోదు అని అంటాడు రాజ్. నన్ను గాడిద అంటారా అని.. ఆ తర్వాత నడుముకి బామ్ రాస్తుంది. ఆసనాలు ఎందుకు వేయడం.. నాకు తంటాలు తీసుకొచ్చి పెట్టడం ఎందుకు? అని కావ్య అంటే.. ఎన్ని రోజుల్లే మీ శ్వేత అక్క వచ్చే వరకే అని అంటాడు రాజ్. దీంతో నడుముని గట్టిగా ప్రెస్ చేస్తుంది కావ్య. దీంతో రాజ్ బాబోయ్ అని అరుస్తాడు.

కనకం కంగారు.. భాస్కర్ సెటైర్లు..

ఈ సీన్ కట్ చేస్తే.. అక్కడ ఏం జరుగుతుందో నాకు చాలా టెన్షన్‌గా ఉందయ్యా.. ఎవరు ఏమైన్నా అనుకోని నువ్వు ముందు ఫోన్ చేయ్ అని కృష్ణ మూర్తిని అంటుంది. దీంతో సరే అని భాస్కర్‌కి కాల్ చేస్తాడు కృష్ణమూర్తి. ఎలా ఉన్నావ్ అల్లుడు? అని అడుగుతాడు. నేను ఇక్కడికి ఏ పని మీద వచ్చానో తెలిసి కూడా.. ఎలా ఉన్నావ్ అని అడుగుతున్నావ్ ఏంటి అని భాస్కర్ సీరియస్ అవుతాడు. అది కాదురా మీ అత్త కంగారు పడి ఫోన్ చేయమంది. ఇంతలో కనకం అక్కడ ఏం జరిగిందో అడుగు.. అని పక్క నుంచి అంటుంది. విన్నావుగా చెప్పరా అని కృష్ణ మూర్తి అంటాడు. అన్నయ్యలో జెలసీ మొదలైంది. అది కోపంగా మారి.. అందరి ముందూ కావ్యతోనే నా జీవితం అని బయట పెట్టేస్తాడు అని చెప్తాడు. దీంతో కనకం, కృష్ణమూర్తిలు సంతోషంగా ఫీల్ అవుతారు. సరే ఉంటాను అని భాస్కర్ ఫోన్ పెట్టేస్తాడు.

కృష్ణ మూర్తి ఫ్యామిలీ హ్యాపీ…

ఇంతలో అప్పూ వచ్చి మీకో గుడ్ న్యూస్ అని చెప్తుంది. నేను కానిస్టేబుల్ పోస్ట్‌కి అప్లై చేశాను అని చెప్తుంది. కనకం విచిత్రంగా చూస్తుంది. అదేంటమ్మా నువ్వు ఎస్‌ఐ అవుతానని చెప్పావ్ కదా అని కృష్ణ మూర్తి అంటే.. కాని స్టేబుల్ ఎగ్జామ్ రాస్తే.. ఎస్‌ఐ పోస్ట్ ఈజీగా వస్తుందని మా గురూజీ చెప్పాడని అప్పూ అంటుంది. ఎవరమ్మా ఆయన అని కృష్ణ మూర్తి అంటే.. నేనే మూర్తి గారూ అని రిటైర్డ్ ఎస్‌ఐ. ఇదేంటి? నేరుగా ఇంటికే వచ్చారు గురూజీ అని అప్పూ అంటుంది. అప్పుడు ఇవి మా అమ్మాయి కోసం కొన్నాను.. ఇప్పుడు నీకు ఇద్దామని వచ్చాను అని అంటాడు. దీంతో అప్పూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అయిన వాళ్లే ఈ రోజుల్లో పట్టించు కోవడం లేదు. కానీ మరు మాత్రం సహాయం చేస్తున్నారని కృష్ణ మూర్తి అంటే.. అప్పూలో ఎవరిలోనూ కనపడని పట్టుదల, మొండితనం కనిపించింది. అందుకే హెల్ప్ చేస్తున్నా అని రిటైర్డ్ ఎస్ఐ అంటాడు.

ఇవి కూడా చదవండి

ఇందిరా దేవి, భాస్కర్‌ల ప్లాన్ షురూ..

మరోవైపు రాజ్ పై నుంచి మెట్లు దిగలేక వస్తూ ఉంటాడు. అదేంటి రా.. డెలివరీకి వచ్చిన లేడీలా నడుస్తున్నావ్ అని ప్రకాష్ అంటాడు. ఆచి తూచి అడుగేయాలని పెద్దవాళ్లు చెప్పారు కదా అందుకే అని రాజ్ అంటాడు. ఈలోపు ఇందిరా దేవి, భాస్కర్ లు డ్రామా స్టార్ట్ చేస్తారు. నేను చెప్పేది వినండి బామ్మ గారూ.. నేను ఇక్కడ ఉండటం రాజ్ అన్నయ్యకు అస్సలు ఇష్టం లేదు వెళ్లి పోతాను అని అంటాడు భాస్కర్. ఇది విన్న రాజ్ లోలోపల హ్యాపీ ఫీల్ అవుతాడు. బావ చెప్పేది నిజం అమ్మమ్మగారూ ఏ భర్త అయినా బావతో మాట్లాడితే జీర్ణం చేసుకోలేడు. అది బావకి అర్థమై.. వెళ్లిపోతా అంటున్నాడు. బావ హోటల్‌లో ఉండటమే అందరికీ మంచిది. ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదు కదా అని కావ్య అంటుంది. ఏంట్రా రాజ్.. నువ్వేలా అలా సంకుచితంగా ఆలోచిస్తున్నావా.. కావ్యని కానీ.. ఆ అబ్బాయిని కానీ ఏమన్నా అన్నావా అని ఇందిరా దేవి అంటుంది.

రాజ్‌ నోటితోనే ఉండమని చెప్పించిన కావ్య, బావలు..

నేను అనలేదు నాన్నమ్మా.. నాది అసలే బ్రాడ్ మైండ్.. అసలే అబ్రాడ్‌లో చదివాను కదా అని.. ఏమైందో అతన్నే అడగు అని రాజ్ అంటాడు. అయ్యో బామ్మగారూ అన్నియ్యా ఏమీ అనలేదని భాస్కర్ అంటే.. మరి ఇంకే నువ్వు అబ్రాడ్ వెళ్లేంత వరకూ ఇక్కడే ఉండు అని ఇందిరా దేవి అంటుంది. ఆ ముక్క అన్నియ్య నోటి నుంచి వస్తే నాకు ధైర్యంగా ఉంటుందని బావ అంటాడు. కావ్య కూడా అవును ఆయన చెప్తేనే బావుంటుంది. లేదంటే పద బావా నీ బట్టలు సర్దేస్తాను.. హోటల్‌కి వెళ్లిపోదువు అని అంటుంది. ఏం యాక్టింగ్ చేస్తున్నారో.. నా నోటితో చెప్పించాలనే కదా.. సరే ఉండు అని రాజ్ చెప్పేసి వెళ్తాడు. సరే అన్నియ్యా అయితే కావ్యను తీసుకుని సిటీ అంతా చూసి వస్తాను అని భాస్కర్ అంటే సరే అని ఇందిరా దేవి అంటుంది. కావాలంటే మీరు కూడా మాతో రావచ్చు అండి అని కావ్య అంటుంది. నాకు ఆఫీస్‌లో మీటింగ్ ఉంది కుదరదు. మీరు వెళ్లి రండి అని రాజ్.. ఆఫీస్‌కి వెళ్తాడు.

కావ్య ఎవరితో ఎక్కడి వరకూ ఉండాలో బాగా తెలుసు: అపర్ణ

ఏంటో ఇలా పరాయి వ్యక్తితో దుగ్గిరాల ఇంటి కోడలు తిరుగుతుంది అంటే బయట ఎలా ఉంటుందని రుద్రాణి అంటుంది. అందులో తప్పేం ఉంది రుద్రాణి.. భర్త పర్మిషన్ తీసుకునే కదా వెళ్లింది. అందులో నీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అని అపర్ణ అంటుంది. వాళ్లిద్దరూ బావా, మరదలు అని మనకు తెలుసు.. బయట వాళ్లకు తెలీదు కదా అక్కా.. దుగ్గిరాల ఇంటి కోడలు వేరే కుర్రాడితో తిరుగుతుందని తప్పుగా అనుకోరా.. ధాన్య లక్ష్మీ అందరూ నీలాగా, రుద్రాణిలాగా ఆలోచించరు. ఆ అబ్బాయి ఏ కల్మషం లేని వ్యక్తి. కావ్య కూడా ఎవరితో ఎక్కడి వరకూ ఉండాలో అక్కడి వరకే ఉంటుందని అపర్ణ వెనకేసుకొస్తుంది. ఒకవేళ నా కోడలికే బావ పుట్టుకొచ్చి.. వాడితో బయటకు వెళ్తాను అంటే.. నేను అస్సలు పంపించను అని ధాన్య లక్ష్మి అంటుంది. నీకు సంస్కారం లేదని నువ్వే ఒప్పుకుంటున్నావ్.. నీ జన్మ ధన్యం అని ప్రకాష్ అంటాడు. మీరంతా ఇంది చాలా లైట్‌గా తీసుకుంటున్నారు అని రుద్రాణి అంటుంది. నువ్వూ, నీ కొడుకు కలిసి స్వప్న మీద అంత పెద్ద నింద వేశారు. ఆ తర్వాత అందరి ముందూ పరువు పోయింది. నీలాగా ఆలోచిస్తే నాకు వ్యక్తిత్వం లేకుండా పోతుందని అపర్ణ అంటుంది. ఇద్దరు ఆడవాళ్లు కలిసి.. సాటి ఆడదాని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. ఇదేనా మీ వివేకం. తన భర్త పర్మిషన్ తీసుకునే అతన్ని ఇంట్లో ఉండనిచ్చింది కావ్య అది కూడా తెలుసుకోలేక పోతున్నారా.. అని ఇందిరా దేవి చివాట్లు పెడుతుంది.

నువ్వు కూడా ఆఫీస్‌కి బాస్ అవ్వాలి.. అనామిక కొత్త ప్లాన్..

మరోవైపు కళ్యాణ్ రాక కోసం వెయిట్ చేస్తూ.. కావాలని నటిస్తుంది అనామిక. బుంగ మూతి పెట్టుకుని పక్కన కూర్చుంటుంది. కానీ కళ్యాణ్ అనామికను పట్టించుకోకుండా ఆఫీస్‌కి రెడీ అయి.. వెళ్తాను అని చెప్తాడు. వెళ్లండి.. నాకెందుకు చెప్పండి.. ఫీల్ అవుతున్నా అని కూడా పట్టించుకోలేదని అనామిక అంటుంది. ఎందుకు అని కళ్యాణ్ అంటే.. అంతేలే చెప్తే కానీ తెలుసుకోలేకపోతున్నావ్ అని అనామిక అంటుంది. నువ్వు ఇలా రోజూ ఆఫీస్‌కి వెళ్తే ఏం ప్రయోజనం ఉంటుంది. రాజ్ బావగారిలా మీరు కూడా బాస్‌లా ఎదగాలి. అప్పుడే నాకు కూడా మీ భార్యగా పేరు వస్తుంది. సొంతంగా మీరు కూడా ఓ బ్రాంచ్ చూసుకుంటా అని చెప్పండి అని అనామిక అంటుంది. అనామిక మాటలకు కళ్యాణ్ షాక్ అవుతాడు. అయినా పెళ్లాన్ని సంతోషంగా ఉంచడానికి అబద్ధం చెప్తే తప్పు లేదులే అని మనసులో అనుకుంటాడు. సరేలే అనామిక నేను కూడా ఓ బ్రాంచ్ చూసుకుంటా అని చెప్తాను అని కళ్యాణ్ అంటాడు. ఆ తర్వాత అనామిక సంతోషంగా ఫీల్ అవుతుంది.

భాస్కర్ సర్ ప్రైజ్.. రాజ్ విలవిల..

కట్ చేస్తే.. భాస్కర్.. కావ్యను ఓ రెస్టారెంట్‌కి తీసుకొస్తాడు. ఏంటి బావా ఇక్కడికి తీసుకొచ్చావ్.. అని కావ్య అంటుంది. నీకో సర్‌ప్రైజ్ ఉంది వెయిట్ అండ్ సీ అని అంటాడు. అప్పుడే వెనకాల రాజ్, శ్వేతలు కూడా వస్తారు. వాడు అన్నంత పనీ చేసేలా ఉన్నాడు అని రాజ్ అంటాడు. ఈలోపు కావ్యకు.. రాజ్ వచ్చిన విషయం చెప్తాడు భాస్కర్. అది విని కావ్య షాక్ అవుతుంది. ఆ తర్వాత భాస్కర్.. వెయిటర్‌ని పక్కకు పిలిచి.. కేక్, బొకే తెమ్మని చెప్తాడు. ఆ వెయిటర్‌ని పక్కకు పిలిచి ఏం చెప్పాడు అని రాజ్ అడుగుతాడు. ఆయన ఓ కేక్, బొకే తీసుకు రమ్మన్నాడని వెయిటర్ చెప్తాడు. దీంతో రాజ్ షాక్ అవుతాడు. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.