Mohan Babu: మోహన్ బాబు మాస్ వార్నింగ్.. అలాంటివారిపై చర్యలు తీసుకుంటానని ట్వీట్
టాలీవుడ్ లో మోహన్ బాబు అంటే అందరికీ సుపరిచితమైన పేరు. తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో 90వ దశకంలో సంచలనం సృష్టించారు.

టాలీవుడ్ లో మోహన్ బాబు అంటే అందరికీ సుపరిచితమైన పేరు. తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప నటుడిగా గుర్తింపు పొందారు. పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు వంటి సూపర్ హిట్ చిత్రాలతో 90వ దశకంలో సంచలనం సృష్టించారు. తన పేరును రాజకీయంగా వాడుకుంటున్న వారికి ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా మంచు మోహన్ బాబు క్రియాశీలకంగా వ్యవహరించారు. 1995 నుంచి 2001 వరకు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.
ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నారు. ఇటీవల తన పేరును చాలా మంది రాజకీయంగా వాడుకుంటున్నారని తెలుసుకున్న ఆయన మాస్ వార్నింగ్ ఇచ్చారు. తన పేరును కొందరు రాజకీయంగా వాడుకుంటున్నారని మోహన్ బాబు అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో ఓ లేఖ ప్రచురితమైంది. ఏ పార్టీ కూడా తమ ప్రయోజనాల కోసం తన పేరును వాడుకోవద్దని కోరారు. ‘ఇటీవల కొందరు నా పేరును రాజకీయంగా వాడుకుంటున్నట్లు నా దృష్టికి వచ్చింది.
దయచేసి నా పేరును ఏ పార్టీ వారి ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నానని, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. తన అభ్యర్థనను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మోహన్ బాబు హెచ్చరించారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.