Allu Arjun: అల్లు అర్జున్ వారసుడు వచ్చేస్తున్నాడు! ఆ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో అల్లు అయాన్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ది ప్రత్యేకమైన స్థానం. పుష్ప సినిమాకు గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడీ స్టైలిష్ స్టార్. ఇక బన్నీ సోదరుడు అల్లు శిరీష్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. అలాగే అల్లు అర్జున్ కూతురు సమంతతో కలిసి శాకుంతలం సినిమాలో నటించింది

Allu Arjun: అల్లు అర్జున్ వారసుడు వచ్చేస్తున్నాడు! ఆ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌లో అల్లు అయాన్!
Allu Arjun, Ayaan
Follow us
Basha Shek

|

Updated on: Feb 25, 2024 | 9:22 PM

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ది ప్రత్యేకమైన స్థానం. పుష్ప సినిమాకు గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాడీ స్టైలిష్ స్టార్. ఇక బన్నీ సోదరుడు అల్లు శిరీష్ కూడా హీరోగా రాణిస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ టాలీవుడ్ ప్రముఖ నిర్మాతల్లో ఒకరు. అలాగే అల్లు అర్జున్ కూతురు సమంతతో కలిసి శాకుంతలం సినిమాలో నటించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యిందీ స్టార్ కిడ్‌.ఇలా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అల్లు ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇప్పుడు అల్లు అర్జున్ తనయుడు కూడా సినిమా రంగంలోకి రావడానికి రెడీ అవుతున్నాడని సమాచారం. అది కూడా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ఓ బ్లాక్ బస్టర్ సీక్వెల్ తో. అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్ ‘పుష్ప 2’లో నటిస్తాడని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల క్రితం బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న నటుడు అల్లు అర్జున్ ‘పుష్ప 3’ గురించి మాట్లాడారు. అయితే అక్కడి వారు అల్లు అయాన్ గురించి అడిగితే మోడల్ బోల్తే అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. కాబట్టి పుష్ప 2 లేదా పుష్ప 3 సినిమాలో అల్లు అయాన్ ఉంటాడని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.

ఇక అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ సోషల్ మీడియాలో బాగా పాపులర్. సమంత నటించిన ‘శాకుంతలం’ సినిమాలో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పై కనిపించింది. అర్హతో పోల్చుకుంటే అయాన్ కొంచెం డిఫరెంట్. ఇప్పుడిప్పుడే నెట్టింట వైరలవుతున్నాడు. ఇటీవల షారుఖ్ పాట పాడి మరింత ఫేమస్ అయ్యాడు. ఇప్పుడిదే క్రేజ్ తో పుష్ప 2లో అల్లు అయాన్ ఎంట్రీ ఇస్తున్నాడని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత నిజమెంతుందో తెలియాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నాడు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు ఐకాన్ స్టార్‌.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Jatiratnaalu (@jatiratnaalu)

blockquote class=”twitter-tweet”>

Model ayAAn 🤙 https://t.co/IUBUv77gC5 pic.twitter.com/2fUmaDf0B0

— Allu bhAAi (@IAmAA_fan) February 21, 2024

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.