Brahmamudi, February 26th episode: బావ ప్లాన్ అదుర్స్.. పాపం ఇరుకున్న రాజ్.. ఆఫీస్‌కు అనామిక!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. టుడే వాలంటైన్స్ డే కదా.. కావ్యకు అతను లవ్ ప్రపోజ్ చేయడానికి.. కేక్, ఫ్లవర్ బుకే ఆర్డర్ చేశాడని రాజ్‌కు వెయిటర్ చెప్తాడు. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. చూశావా వాడు కళావతిని బుట్టలో పడేసేందుకు ఎలాంటి ఎత్తు వేశాడో.. కళావతి మనసు మార్చాలని వాలంటైన్స్‌డేని అడ్డు పెట్టుకున్నాడు. కళావతికి లవ్ ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడని రాజ్.. శ్వేత దగ్గర గింజుకుంటాడు. దానికి అలా చేస్తే నీకేంటి? నువ్వు ఎందుకు అంత బాధ పడుతున్నావ్..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్‌లో.. టుడే వాలంటైన్స్ డే కదా.. కావ్యకు అతను లవ్ ప్రపోజ్ చేయడానికి.. కేక్, ఫ్లవర్ బుకే ఆర్డర్ చేశాడని రాజ్‌కు వెయిటర్ చెప్తాడు. అది విన్న రాజ్ షాక్ అవుతాడు. చూశావా వాడు కళావతిని బుట్టలో పడేసేందుకు ఎలాంటి ఎత్తు వేశాడో.. కళావతి మనసు మార్చాలని వాలంటైన్స్‌డేని అడ్డు పెట్టుకున్నాడు. కళావతికి లవ్ ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చాడని రాజ్.. శ్వేత దగ్గర గింజుకుంటాడు. దానికి అలా చేస్తే నీకేంటి? నువ్వు ఎందుకు అంత బాధ పడుతున్నావ్.. నువ్వు ఎలాగో నీ జీవితంలో నుంచి తప్పుకోమన్నావ్ కదా.. ఆ తర్వాత తాను ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నీకేంటి? తను నిన్ను ప్రేమించింది.. కానీ నువ్వు దూరం అయిపోతే.. జీవితాంతం నిన్నే తలచుకుంటూ ఏడుస్తూ కూర్చోవాలా.. ఆమెను ప్రేమించిన వాడికి ఓకే చెప్తే తప్పేంటి? ఒక వేళ తన బావ లవ్ ప్రపోజ్ చేస్తే.. ఓకే చెప్పాలని నేనూ కోరుకుంటున్నాను అని శ్వేత అంటుంది.
గింజుకుంటున్న రాజ్.. ఎంట్రీ ఇచ్చిన పెద్దావిడ, పెద్దాయన..
శ్వేత అలా అనకు. కళావతి తొందర పడి అలాంటి నిర్ణయాలు తీసుకోదని రాజ్ అంటాడు. ఇప్పుడు కావ్య అతని ప్రపోజల్ ఒప్పుకుంటే ఏం చేస్తావ్? ఏం చేయగలవు అని శ్వేత అంటుంది. నేను ఇంకా డివోర్స్ ఇవ్వలేదు. నేను ఒప్పుకోను. వాడు నా భార్యకు లవ్ ప్రపోజ్ చేయడం ఏంటి? అలా జరగనివ్వను అని రాజ్ అంటాడు. ఈలోపు కేక్ వస్తుంది. ఏంటి బావా ఏం చేస్తున్నావ్? అని కావ్య అంటే.. వెయిట్ అండ్ సీ అని భాస్కర్ అలియాస్ బావ అంటాడు. ఇంతలో పెద్దావిడ, పెద్దాయన ఎంట్రీ ఇస్తారు. వాళ్లను చూసి రాజ్ మరింత షాక్ అవుతాడు. వాళ్లకు నిజం తెలిసిందంటే.. నన్ను నడి రోడ్డు మీదకు గెంటేస్తారు. ఎలా అని కావ్య దగ్గరకు వెళ్లిపోతాడు రాజ్.
పెద్దావిడ, బావల ప్లాన్ అదుర్స్.. కావ్యకు రాజ్ ప్రపోజల్..
ఏంటీ మీరూ ఇక్కడికే వచ్చారా.. కావ్యకు లవ్ ప్రపోజ్ చేయడానికి వచ్చారా అని పెద్దావిడ అడుగుతారు. ఇవ్వాళ ప్రేమికుల రోజు కదా అందుకే మీ తాతయ్యను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చానని పెద్దావిడ అంటుంది. మరింక లేట్ ఎందుకు మొదలు పెట్టమని సీతా రామయ్య అంటాడు. అప్పుడే మీడియా కూడా వస్తుంది. ఆ తర్వాత కావ్యకు బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తాడు రాజ్. నెక్ట్స్ కావ్య కూడా ఓ ఫ్లవర్ ఇచ్చి రాజ్‌కు ప్రపోజ్ చేస్తుంది. ఇక ఇద్దరూ కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించారు. పక్క నుంచి ముసిముసి నవ్వులు నవ్వుతాడు భాస్కర్.
ప్రేమపై పెద్దావిడ లెక్చర్..
పెళ్లికి ముందు వాళ్లను కలిపి ఉంచేందుకు ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది. కానీ పెళ్లి తర్వాత బంధం నిలుపుకోవాలంటే ప్రేమ ఉండాలి. దాంపత్యం అంటే ఇద్దరు భార్యాభర్తలూ ఒక్కలా ఉండరు. ఒక్కలా ఆలోచించరు. ఆలోచనలు.. అభిరుచుల్లో తేడా ఉండొచ్చు. కానీ నమ్మకంలో మాత్రం తేడా రాకూడదు. చూపించుకునే ప్రేమలో తేడా రాకూడదు. ఒకరు ఎక్కువ.. తక్కువ అనే భేధం అస్సలు ఉండకూడదు. మేము 50 ఏళ్లు ఎలాంటి కలత లేకుండా ఉన్నామంటే అందుకు కారణం మేమే. ప్రేమ పంచుకున్నాం. తేడాలు వస్తే కలిసి చర్చించుకున్నాం.. లేకుండే సర్దుకుపోయేవాళ్లం అంటూ రాజ్‌కు అర్థమయ్యే విధంగా పెద్దావిడ పెద్ద క్లాసే తీసుకుంటుంది.
అమ్మో వీడు మాయ చేస్తాడని కావ్యను తీసుకెళ్లిన రాజ్..
ఆ తర్వాత భాస్కర్‌ను చూసిన రాజ్.. అమ్మో కళావతి ఇక్కడే ఉంటే వీడు ఎలాగైనా లవ్ ప్రపోజ్ చేస్తాడు. ఇక్కడి నుంచి తీసుకెళ్లి పోవాలి. కళావతి పదా.. ఆఫీస్‌లో చాలా పని ఉంది అని తీసుకెళ్తాడు. అన్నియ్యా నేనూ అని భాస్కర్ అంటే.. నువ్వు ఎక్కడికి.. ఇక్కడే ఉండి అమ్మమ్మ.. తాతయ్యలను ఇంటికి తీసుకెళ్లు అని చెప్పి వెళ్తాడు. రాజ్‌ని చూసి పెద్దావిడ, భాస్కర్ నవ్వుకుంటారు.
కారులో కావ్య, రాజ్‌ల ప్రేమ యుద్ధం..
ఆ తర్వాత రాజ్, కావ్యలు కారులో వెళ్తూ ఉంటారు. ఏంటి ఆ ఓవర్ యాక్షన్.. అసలు మీ బావ అక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు? అని రాజ్ అడుగుతాడు. మీరు శ్వేతాను తీసుకుని అక్కడికే ఎందుకు వచ్చారు? అంటే మమ్మల్ని ఫాలో అవుతున్నారా అని కావ్య అడిగితే.. మా ఇష్టం.. మేము ఎక్కడికైనా వెళ్తాం నీకెందుకు? అని రాజ్ అంటాడు. సేమ్ ఆన్సర్.. అని కావ్య అంటుంది. అసలు వాడు కేక్, బొకే ఎందుకు తెప్పించాడు? ఏయ్ జవాబు చెప్పు అని రాజ్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతాడు. అంటే ఆ కేక్, బొకే మా బావ నా కోసం తెప్పించాడా.. అంటే మధ్యలో మీరు రాకపోయి ఉంటే.. నాకు లవ్ ప్రపోజ్ చేసేవాడా.. అని కావ్య కావాలనే రాజ్‌ని రెచ్చగొడుతుంది. దీంతో రాజ్ ఉడుక్కుని.. కార్‌ని చాలా ఫాస్ట్‌గా పోనిస్తాడు.
రుద్రాణి పుల్లలు.. రెచ్చిపోయిన అనామిక..
ఈ సీన్ కట్ చేస్తే.. రుద్రాణి.. అనామిక దగ్గరకు వస్తుంది? ఏంటి కళ్యాణ్‌ని ఆఫీస్‌కి పంపించా అని హ్యాపీ ఫీల్ అవుతున్నావా.. అక్కడ కళ్యాణ్ ఎం చేస్తున్నాడో తెలుసుకునే పని లేదా? అని అడుగుతుంది. అవును ఆంటీ మీరు చెప్తే కానీ అర్థం కాలేదు. మీ అత్తయ్య ధాన్య లక్ష్మి ఉత్తి అమాయకురాలు. అందర్నీ నమ్మేస్తుంది. అందుకే వాళ్లను ఇంట్లో బానిసల్లా మార్చేసుకుంది మా వదినా. నువ్వు ఇప్పుడు కూడా ఇలాగే ఉంటే ఆ కావ్యకు బానిస అవుతావ్. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. నీ మొగుడు ఆఫీస్‌కి వెళ్లి చూడు అని రుద్రాణి సలహా ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆఫీస్‌కి వెళ్తే కళ్యాణ్ అనుమానిస్తున్నా అనుకుంటాడేమో.. అని అనామిక అంటుంది. అందుకే ఆఫీస్‌కి అందరికీ కలిపి లంచ్ తీసుకెళ్లు అని రుద్రాణి చెప్తుంది. చాలా మంచి ఐడియా ఇచ్చారు థాంక్స్ ఆంటీ అని చెప్పి వెళ్తుంది అనామిక.
రాజ్ ఫ్రస్ట్రేషన్.. కావ్య కౌంటర్స్..
మరో వైపు.. డిజైన్స్ గురించి శ్రుతిని అడుగుతుంది కావ్య. ఇంతలో రాజ్ వచ్చి.. ఏంటి సోది ఏసుకుని తీరిగ్గా ఉన్నారు? రిలీజ్ అయిన సినిమా గురించా.. పనికి మాలిన కబుర్ల గురించా.. తొక్కా తోటకూర వంటి వాటి గురించా.. అంత డీప్ డిస్కర్షన్ చేసుకుంటున్నారు? అని రాజ్ అడుగుతాడు. మా బావ ఏసుకునే షర్ట్, ప్యాంట్, సెంట్ గురించి అని వెటకారంగా చెప్తుంది కావ్య. ఆపే నీ సోది అని రాజ్ సీరియస్ అవుతాడు. హే శ్రుతి.. క్లయింట్స్‌కి మెయిల్ చేసిన డిజైన్స్ ఏవి? అని రాజ్ అడుగుతాడు. ఏంటి ఇవే పంపించారా.. ఛీఛీ మన కంపెనీ రెప్యుటేషన్ ఏం కావాలి అనుకుంటున్నారు? వీటిని ఏ వెధవ అయినా ఒప్పుకుంటాడా అని రాజ్ అంటాడు. ఏమైంది వీటికి అని రివర్స్ కౌంటర్ ఇస్తుంది కావ్య. ఇక ఇవాళ్టితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది. మరో ఎపిసోడ్‌తో మళ్లీ కలుద్దాం.