Mahesh Babu: మహేశ్ బాబు మనసు కొల్లగొట్టిన ‘పోచర్’ వెబ్ సిరీస్‌.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?

కేరళ అడవుల్లో ఏనుగుల వేట, వాటితో వేల కోట్ల రూపాయల దోపిడీ ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ పోచర్. నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా తెరకెక్కించిన పోచర్ సిరీస్ కు ప్రముఖ నటి అలియా భట్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం

Mahesh Babu: మహేశ్ బాబు మనసు కొల్లగొట్టిన 'పోచర్' వెబ్ సిరీస్‌.. ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
Mahesh Babu
Follow us
Basha Shek

|

Updated on: Feb 27, 2024 | 10:04 PM

కేరళ అడవుల్లో ఏనుగుల వేట, వాటితో వేల కోట్ల రూపాయల దోపిడీ ఆధారంగా తెరకెక్కించిన వెబ్ సిరీస్ పోచర్. నిమిషా సజయన్, రోషన్ మాథ్యూ, దిబ్యేందు భట్టాచార్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఢిల్లీ క్రైమ్ లాంటి సిరీస్ డైరెక్ట్ చేసిన రిచీ మెహతా తెరకెక్కించిన పోచర్ సిరీస్ కు ప్రముఖ నటి అలియా భట్ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సైతం పోచర్ సిరీస్‌ స్ట్రీమింగ్ అవుతుంది. భారత దేశంలోని అతి పెద్ద క్రైమ్ రాకెట్స్ లో ఇది ఒకటి అనే క్యాప్షన్ తెరకెక్కిన పోచర్ సిరీస్ ఆడియెన్స్ ను అమితంగ ఆకట్టుకుంటోంది. ఏనుగులను వేటాడే ముఠా ఆగడాలు, వారిని పట్టుకోవడానికి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల ప్రయత్నాలు.. ఇలా ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సిరీస్ ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై రికార్డులు సృష్టిస్తోంది పోచర్. తాజాగా ఈ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వీక్షించారు. అనంతరం సిరీస్ పై తన అభిప్రాయాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

‘ఏనుగులను అలా ఎలా చంపేస్తారు..? అలా చేస్తున్నప్పుడు వారి చేతులు వణకవా..? అలా చేసే వారిలో మానవత్వం ఉండదా..? పోచర్ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు నా మైండ్ లో ఇవే క్వశ్చన్స్ రన్ అయ్యాయి. ఈ జెంటిల్ జెయింట్స్ ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు పోరాడాలి’ అని రాసుకొచ్చాడు మహేశ్‌. ప్రస్తుతం ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇప్పటికే పోచర్ సిరీస్ కు ఓటీటీలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. మరి మహేశ్ రివ్యూతో మరెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

పోచర్ పై మహేశ్ బాబు రివ్యూ…

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే ఇలా జరుగుతుందా..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
రమ్యకృష్ణ పక్కన ఉన్న ఈ చిన్నోడు టాలీవుడ్ హీరో..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
ఆ హీరోయిన్లతో అనుచిత ప్రవర్తన.. వరుణ్ ధావన్ ఏమన్నారంటే..
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
సినిమా ఇండస్ట్రీలో అనుకోని సంఘటనలు.. మంచు విష్ణు కీలక ప్రకటన
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు
ఆ కార్లపై నమ్మలేని ఆఫర్లు..ఆ మోడల్‌కు మాత్రమే ప్రత్యేక తగ్గింపులు