AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Naatu Naatu: ‘నాటు నాటు’ స్టెప్‌ను కాపీ కొట్టిన బాలీవుడ్ స్టార్స్‌ ‌.. ట్రోల్ చేస్తోన్ననెటిజన్లు.. వీడియో ఇదిగో

బాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో బడే మియా చోటే మియా ఒకటి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రంజాన్ పండగ సందర్భంగా ఈ మల్టీస్టారర్ మూవీ రిలీజ్ కానుంది.

Naatu Naatu: 'నాటు నాటు' స్టెప్‌ను కాపీ కొట్టిన బాలీవుడ్ స్టార్స్‌ ‌.. ట్రోల్ చేస్తోన్ననెటిజన్లు.. వీడియో ఇదిగో
Bade Miyan Chote Miyan Movie
Basha Shek
|

Updated on: Feb 28, 2024 | 5:07 PM

Share

బాలీవుడ్ లో ఈ ఏడాది రిలీజ్ కానున్న ది మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో బడే మియా చోటే మియా ఒకటి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటించారు. సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. రంజాన్ పండగ సందర్భంగా ఈ మల్టీస్టారర్ మూవీ రిలీజ్ కానుంది. దీంతో చిత్రబృందం సినిమా ప్రమోషన్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా ఈ చిత్రంలోని రెండో పాట ‘బడే మియా చోటే మియా’ విడుదలైంది. ఈ ‘మస్త్ మలంగా జూమ్..’ పాట చూసిన వారికి ‘RRR’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాట గుర్తుకొస్తుంది . రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు సూపర్బ్ స్టెప్పులేశారు. ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ‘బడే మియా చోటే మియా’ సినిమాలోని పాటలో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ లు కూడా నాటు నాటు హుక్ స్టెప్ ను రీక్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నాటు నాటు స్టెప్పులు కాపీ కొట్టారంటూ నెటిజన్లు బాలీవుడ్ స్టార్స్ ను ట్రోల్ చేస్తున్నారు.

అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటించడంతో అభిమానుల్లో డే మియా చోటే మియా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ చిత్ర బృందం డ్యాన్స్ స్టెప్పును కాపీ కొట్టి ట్రోల్ చేస్తున్నారు. అయినప్పటికీ ‘మస్త్ మలంగా జూమ్..’ పాట నెట్టింట బాగా ఫేమస్ అవుతోంది. మస్త్ మలంగా జూమ్..’ పాటకు బాస్కో సీజర్ కొరియోగ్రఫీ అందించారు. మరి కాపీయింగ్ ఆరోపణలపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

హీరోలపై చెప్పులు.. అభిమానుల క్షమాపణలు..

‘బడే మియా చోటే మియా’ ప్రమోషన్లలో భాగంగా తాజాగా లక్నోలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇంతలో కొందరు దుండగులు చెప్పులు విసరడం ప్రారంభించారు. దీంతో తొక్కిసలాట జరుగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో అక్ష‌య్‌, టైగ‌ర్‌లు కార్య‌క్ర‌మం సగంలోనే వెళ్లిపోయారు. తాజాగా ఈ ఘటనపై అక్షయ్ కుమార్ అభిమానులు క్షమాపణలు చెప్పారు. ‘అక్షయ్ కుమార్ సార్‌. మమ్మల్ని క్షమించండి. తదుపరిసారి మంచి స్థలాన్ని ఎంచుకోండి.’ మరికొందరు ‘అక్షయ్‌, టైగర్‌కి ఏమీ జరగకపోవడం మాకు సంతోషంగా ఉంది. తప్పకుండా మీ సినిమా చూస్తాం’ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
'బరాబర్ ప్రేమిస్తా' హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ మామూలుగా లేదుగా
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
బంగారం, వెండి అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..! ఈ సీక్రెట్..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
క్యాన్సర్ రమ్మన్నా రాదు.. వీటి జోలికి వెళ్లకపోతే చాలు..
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఒక్కరాత్రిలో టీమిండియా పరువు కాపాడి హీరోగా మారిన హైదరాబాదీ
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ వాడేవారికి హెచ్చరిక.. హ్యాక్ ముప్పు
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
రికార్డు స్థాయిలో పెరిగిన భారత విదేశీ మారక నిల్వలు!
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
మార్చి నెలలో అరుదైన చంద్రగ్రహణం.. భారతదేశంలో ఎక్కడ కనిపిస్తుందంటే
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
కలర్, అందాన్ని బట్టి రేటు..నగరంలో విచ్చలవిడిగా చిన్నారుల అమ్మకాలు
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
పోషకాల నిధి.. ఆకు కూరల్లో బెస్ట్ ఇదే..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..
జామకాయ Vs అవకాడో.. ఆరోగ్యానికి ఏది మంచిది..? బరువు తగ్గేవారికి..