Rajinikanth: సూపర్ స్టార్ సింప్లిసిటీ.. కడప ఎయిర్ పోర్ట్‌లో రజనీ.. ఎకానమీ క్లాస్‌లో జర్నీ.. వీడియో

సూపర్ స్టార్ రజనీకాంత్‌ సిల్వర్ స్ట్ర్కీన్ పై ఎంతో స్టైలిష్ గా ఉంటారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆయన వీలైనంత సాదాసీదాగా ఉండాలనుకుంటారు. పెద్దగా ఆడంబరాలకు వెళ్లరు. హిమాలయాల్లో రోడ్లపై నిల్చొని అందరితో కలిసి భోజనాలు చేయడం, విగ్గులు వాడకపోవడం.. ఇలా ఆయన సింప్లిసిటీకి చాలా నిదర్శనాలు ఉన్నాయి

Rajinikanth: సూపర్ స్టార్ సింప్లిసిటీ.. కడప ఎయిర్ పోర్ట్‌లో రజనీ.. ఎకానమీ క్లాస్‌లో జర్నీ.. వీడియో
Rajinikanth
Follow us
Basha Shek

|

Updated on: Mar 01, 2024 | 7:30 PM

సూపర్ స్టార్ రజనీకాంత్‌ సిల్వర్ స్ట్ర్కీన్ పై ఎంతో స్టైలిష్ గా ఉంటారు. అయితే నిజ జీవితంలో మాత్రం ఆయన వీలైనంత సాదాసీదాగా ఉండాలనుకుంటారు. పెద్దగా ఆడంబరాలకు వెళ్లరు. హిమాలయాల్లో రోడ్లపై నిల్చొని అందరితో కలిసి భోజనాలు చేయడం, విగ్గులు వాడకపోవడం.. ఇలా ఆయన సింప్లిసిటీకి చాలా నిదర్శనాలు ఉన్నాయి. తాజాగా ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. రజనీకాంత్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కడప నుంచి ఇండిగో విమానంలో ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన అభిమానులు రజనీకాంత్ సింప్లిసిటీని ప్రశంసిస్తున్నారు. రజనీకాంత్ కు ఇప్పుడు సుమారుగా 73 ఏళ్లు. ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. బయట సూపర్ స్టార్ కనిపిస్తే అభిమానులు ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అయితే ఇక్కడా తన విశాల హృదయాన్ని చాటుకున్నారు రజనీ సార్. ఎంతో ఓపికగా, విమానంలోని ఎకానమీ క్లాస్‌లో జర్నీ చేస్తూ తోటి ప్రయాణికులతో చాలా సేపు మాట్లాడాడు. అలా రజనీకాంత్‌ను దగ్గరి నుంచి చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ‘సూపర్ స్టార్’ రజనీకాంత్ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. ఆయనను షూటింగ్‌కి పిలిచే నిర్మాత ఓ ప్రైవేట్‌ జెట్‌కి ఏర్పాట్లు చేస్తాడు. అయితే రజనీకాంత్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బిజినెస్ క్లాస్‌తో పోలిస్తే, ఎకానమీ క్లాస్‌లో తక్కువ సౌకర్యాలు ఉంటాయి. అయినా కూడా రజనీకాంత్ ఎఎకానమీ క్లాస్‌లోనే ప్రయాణించారు.

ఇక సినిమాల విషయానికొస్తే..2023లో విడుదలైన ‘జైలర్‌’ చిత్రంతో రజనీకాంత్‌ మంచి విజయాన్ని అందుకున్నారు రజనీకాంత్‌. అయితే ఈ ఏడాది ప్రారంభంలో కాస్త ఎదురుదెబ్బ తగిలింది. ఆయన అతిధి పాత్రలో కనిపించిన ‘లాల్‌ సలామ్‌’ చిత్రం పెద్దగా ఆకట్టుకోలేఉద. ప్రస్తుతం రజనీకాంత్ ‘వెట్టయన్’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు. ‘వెట్టయన్’ చిత్రానికి ‘జై భీమ్’ ఫేమ్ దర్శకుడు టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టైటిల్ టీజర్ అభిమానులను అలరించింది . ఇందులో రజనీతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాసిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, కిషోర్ వంటి స్టార్ నటీనటులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

విమానంలో రజనీ కాంత్..

రజనీకాంత్ తో జీవా..

View this post on Instagram

A post shared by Jiiva (@actorjiiva)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఈడో జాతిరత్నం.. ఆణిముత్యం.. డాక్టర్ అంటే ఇతనట.. చదివితే మీరూ
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్
ఖేల్ రత్న నామినేషన్లపై స్పందించిన మను భాకర్