Taapsee Pannu: మొన్న రకుల్.. ఇప్పుడు తాప్సీ.! పెళ్లిపీటలెక్కనున్న మరో స్టార్ హీరోయిన్
సినీ సెలబ్రిటీలు డేటింగ్‌లకు స్వస్తి చెప్పి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవలే తన ప్రియుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్పీ వంతు వచ్చింది. తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది.
సినీ సెలబ్రిటీలు డేటింగ్‌లకు స్వస్తి చెప్పి వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. మూడేళ్లుగా ప్రేమలో ఉన్న రకుల్ ప్రీత్‌సింగ్ ఇటీవలే తన ప్రియుడితో కలిసి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తాప్పీ వంతు వచ్చింది. తాప్సీ తన బోయ్ ఫ్రెండ్ మథియాస్ బోను పెళ్లాడబోతోంది. దశాబ్ద కాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారు. సిక్కు, క్రిస్టియానిటీ రెండు సంప్రదాయాల ప్రకారం వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో మార్చి నెలలో వివాహం జరగనున్నట్టు తెలుస్తోంది. తాప్పీ ప్రియుడు మథియాస్ డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్. ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 1998లో మథియాస్ తన అంతర్జాతీయ కెరీర్ ను ప్రారంభించాడు. డబుల్స్ లో ఆయన నెంబర్ 1 ర్యాంకును సాధించాడు. ప్రస్తుతం ఇండియా డబుల్స్ టీమ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. 2012 ఒలింపిక్స్ లో డబుల్స్ లో సిల్వర్ మెడల్ గెలుపొందాడు.
2013 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించాడు. 2013లో బాలీవుడ్ లో అడుగుపెట్టిన సమయంలో తాప్సీ, మథియాస్ మధ్య రిలేషన్ ప్రారంభమయింది. 2010లో ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత స్టార్ హీరోయిన్‌గా ఎదిగి పలు సినిమాలు చేసింది. తమిళం, మలయాళంలోనూ మూవీస్ చేశారు. ఇక్కడ ఛాన్స్‌లు తగ్గడంతో.. బాలీవుడ్‌కి వెళ్లిపోయింది. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తూ నార్త్ లోనే సెటిల్ అయ్యింది ఈ భామ. ఇటీవలే షారుఖ్ ఖాన్ జోడిగా డంకీ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చింది. గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ భారీ వసూళ్లు రాబట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

