AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Manoj-Mounika: ‘నాకు, ధైరవ్‌కు మనసులో చోటిచ్చినందుకు థ్యాంక్స్ మనోజ్‌’.. పెళ్లి రోజున మౌనిక ఎమోషనల్‌

మనోజ్, మౌనికల వివాహం జరిగి జరిగి ఆదివారానికి (మార్చి 3) సరిగ్గా ఏడాది. పెళ్లి రోజును పురస్కరించుకుని మనోజ్ తో తన అనుబంధంపై ఎమోషనలయ్యింది మౌనిక. తన ఫ్యామిలీకి సంబంధించిన అరుదైన ఫొటోలను పంచుకుంటూ భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది.

Manchu Manoj-Mounika: 'నాకు, ధైరవ్‌కు మనసులో చోటిచ్చినందుకు థ్యాంక్స్ మనోజ్‌'.. పెళ్లి రోజున మౌనిక ఎమోషనల్‌
Manchu Manoj, Bhuma Mounika
Basha Shek
|

Updated on: Mar 03, 2024 | 7:20 PM

Share

టాలీవుడ్ రాక్ స్టార్ హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల కుమార్తె మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనోజ్‌ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. దగ్గరుండి మరీ మనోజ్, మౌనికల వివాహాన్ని జరిపించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దిరికి ఇది రెండో పెళ్లి కాగా.. మౌనికకు అప్పటికే ధైరవ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే పెళ్లి రోజే ధైరవ్‌ బాధ్యత కూడా తనదేనని ప్రకటించాడు మనోజ్‌. ఇప్పుడు వీరి జీవితంలోకి మరో బుజ్జాయి అడుగుపెట్టనుంది. ప్రస్తుతం మౌనిక గర్భంతో ఉంది. మనోజ్, మౌనికల వివాహం జరిగి జరిగి ఆదివారానికి (మార్చి 3) సరిగ్గా ఏడాది. పెళ్లి రోజును పురస్కరించుకుని మనోజ్ తో తన అనుబంధంపై ఎమోషనలయ్యింది మౌనిక. తన ఫ్యామిలీకి సంబంధించిన అరుదైన ఫొటోలను పంచుకుంటూ భర్తకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది.

‘హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ హజ్బెండ్‌. నా లైఫ్ మొదలైనప్పటినుంచే నువ్వు నాకు తెలుసనిపిస్తోంది. మన ఇద్దరి మధ్య అన్ని జ్ఞాపకాలున్నాయి. నాకు, ధైరవ్‌కు నీ మనసులో చోటిచ్చినందుకు థ్యాంక్స్‌. ఫ్రెండ్‌షిప్‌, పార్ట్‌నర్‌షిప్‌, క్రేజీషిప్‌.. ఇలా అన్నింటినీ అందించిన యూనివర్స్‌కు కూడా థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నాను. నాకు ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చేలా చేసింది నువ్వే. సంతోషం, అనురాగాలు, ఆప్యాయతలు, బలాన్ని పంచుతూ ఈ ప్రపంచాన్ని మరింత అందమైన ప్రదేశంగా మార్చుకుందాం. పెళ్లిరోజు శుభాకాంక్షలు మనోజ్‌. ఐ లవ్యూ. నా హృదయంలో నీకంటూ ప్రత్యేక స్థానం ఎప్పటికీ పదిలంగా ఉంటుంది’ అని ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టింది మౌనిక. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు మనోజ్- మౌనిక దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మౌనిక ఎమోషనల్ పోస్ట్..

బేబీ బంప్  భూమా మౌనికా రెడ్డి..

మంచు మనోజ్ పోస్ట్..

భార్య మౌనికతో మనోజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
అర్జెంట్‌గా పాన్‌ కార్డ్‌ కావాలా? ఇలా అప్లై చేయండి!
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
సెమీస్‌కు పాకిస్తాన్.. శ్రీలంకపై ఎంత తేడాతో గెలవాలంటే?
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
ఆంధ్ర స్టైల్ గోంగూర మటన్ కర్రీ.. ఇలా వండితే ముద్ద ముద్దకూ
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
అమ్మ కల నెరవేరింది..తొలిసారి ఫ్లైట్‌ ఎక్కింది..కొడుకు చేసిన పనితో
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఇవి మీ వద్ద లేకుంటే.. ఎంత సంపద ఉన్నా ఆవిరే!
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఘరానా మొగుడు సినిమాకు చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే..
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
ఈ నక్షత్రాల్లో పుట్టినవారికి 40 ఏళ్లకే కోటీశ్వరులయ్యే అదృష్టం..!
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
హోలికా ఎవరు...? కామ దహనం ఎందుకు చేస్తారో తెలుసా..? ఇది తెలిస్తేనే
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
భారత్‌లోని ఈ ప్రాంతాల్లో గోల్డ్ ఫ్రీ.. ఫ్రీ.! ఎక్కడెక్కడంటే.?
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!
వీటిని పచ్చిగా తింటే మీ మెదడులోకి పురుగులు వెళ్లడం పక్కా..!