Anant Ambani: షారుక్‌కు పామును గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ.. పడి పడి నవ్విన రాధిక మర్చెంట్.. వీడియో

రిలయన్స్ అధినేత, భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తెల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మార్చి 1 నుంచి 3 వవరకు గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు సందడి చేశారు.

Anant Ambani: షారుక్‌కు పామును గిఫ్ట్‌గా ఇచ్చిన అనంత్ అంబానీ.. పడి పడి నవ్విన రాధిక మర్చెంట్.. వీడియో
Anant Ambani, Shah Rukh Khan
Follow us
Basha Shek

|

Updated on: Mar 04, 2024 | 2:14 PM

రిలయన్స్ అధినేత, భారతీయ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, ప్రముఖ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చెంట్ కుమార్తె రాధికా మర్చెంట్‌ ల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. మార్చి 1 నుంచి 3 వవరకు గుజరాత్ లోని జామ్ నగర్ వేదికగా జరిగిన ఈ వేడుకల్లో అంతర్జాతీయ సెలబ్రిటీలు సందడి చేశారు. అలాగే పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా అనంత్ అంబానీ ప్రీ వేడుకల్లో పాల్గొన్నారు. తమ డ్యాన్స్‌ లతో అతిథులను అలరించారు. బిల్ గేట్స్, ఇవాంకా, మార్క్ జుకర్ బర్గ్, రామ్ చరణ్, ఆమిర్ ఖాన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌, దిల్జిత్ దోసాంజ్, ఎంఎస్ ధోని, జహీర్ ఖాన్, సూర్య కుమార్ యాదవ్, డ్వేన్ బ్రావో తదితరులు తమ ఆటపాటలతో సందడి చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనంత్ అంబానీ, షారుఖ్ ఖాన్ లకు సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. గతేడాది నవంబర్ లో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ, అల్లుడు ఆనంద్ పిరమల్ కు కవలలు జన్మించారు. వీరికి కృష్ణ, ఆదియా అని నామకరణం చేశారు. ఈ సందర్భంగా నవంబర్‌ లో జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్ వేదికగా డోలారోహణ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించారు. ఎప్పటిలాగే పలువురు సినీ, క్రీడా ప్రముఖులు ఈ ఫంక్షన్ లో సంందడి చేశారు. అయితే ఈ వేడుకలో అనంత్ అంబానీ షారుఖ్ ఖాన్‌కు పామును గిఫ్ట్ గా అందిస్తూ కనిపించాడు. అలాగే మరొక వ్యక్తి ఇంకో పామును షారుఖ్ మెడ మీద ఉంచాడు. ఇది చూసిన అనంత్ కు కాబోయే భార్య రాధిక మర్చంచ్ పడీపడీ నవ్వింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

షారుఖ్ ఖాన్ తో అనంత్ అంబానీ..

రాధిక మర్చెంట్ క్లాసికడ్ డ్యాన్స్ చూశారా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే