- Telugu News Photo Gallery Cinema photos Heroine Radhika Apte Shocking Comments on Tollywood industry in social media Telugu Actress Photos
Radhika Apte: ఛీ ఛీ వాళ్లేం హీరోలు.. టాలీవుడ్‌పై రాధికా ఆప్టే సంచలన కామెంట్స్..!
అన్ని ఇండస్ట్రీల్లోని హీరోయిన్లు తెలుగులో నటించాలని కోరుకుంటున్నారిపుడు. ఇక్కడ ఆఫర్ వస్తే.. అదే పదివేలు అనుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తెలుగులో నటించి.. ఇక్కడే గుర్తింపు తెచ్చుకుని.. వేరేచోట ఆఫర్ రాగానే క్రేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు. అందులో రాధికా ఆప్టే అందరికంటే ముందుంటారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..
Updated on: Mar 04, 2024 | 7:38 PM

ఏరు దాటేవరకు ఓడ మల్లన్న.. దాటిన తరువాత బోడి మల్లన్న.. ఇప్పుడు ఈ సామెత ఎందుకు అనుకుంటున్నారు కదా..? రాధికా ఆప్టే తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మరి. తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆహా ఓహో అనేసి.. ఇప్పుడేమో ఛీఛీ టాలీవుడ్ అంటున్నారు. మరి ఆమె బాధేంటో.?

అన్ని ఇండస్ట్రీల్లోని హీరోయిన్లు తెలుగులో నటించాలని కోరుకుంటున్నారిపుడు. ఇక్కడ ఆఫర్ వస్తే.. అదే పదివేలు అనుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం తెలుగులో నటించి.. ఇక్కడే గుర్తింపు తెచ్చుకుని.. వేరేచోట ఆఫర్ రాగానే క్రేజ్ తీసుకొచ్చిన టాలీవుడ్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంటారు.

అందులో రాధికా ఆప్టే అందరికంటే ముందుంటారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీపై సంచలన కామెంట్స్ చేసారు రాధికా.

టాలీవుడ్‌లో హీరోయిన్లకే కాదు.. వాళ్ల కోసం రాసే పాత్రలకు ప్రాధాన్యత ఉండదని.. సెట్స్‌లో హీరోయిన్‌ను మూడో వ్యక్తిగా మాత్రమే చూస్తారని విమర్శించారు.

టాలీవుడ్‌లో మేల్ డామినేషన్ ఎక్కువగా ఉంటుందని.. ఇష్టానుసారం షూటింగ్స్ రద్దు చేస్తారని.. చేసినపుడు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వరని చెప్పుకొచ్చారు రాధిక.

తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఇబ్బందులు తనకు చాలాసార్లు ఎదురయ్యాయని.. అందుకే టాలీవుడ్‌కు దూరంగా ఉన్నానని తెలిపారు రాధిక ఆప్టే. ఇక్కడ ఆమె రక్త చరిత్ర, ధోనీ, లెజెండ్, లయన్ సినిమాల్లోనే నటించారు.

ఇవి మినహా రాధికా తెలుగులో కనిపించిందే లేదు. ఇప్పుడు ఉన్నట్లుండి ఇండస్ట్రీపై పిడుగు లాంటి విమర్శలు గుప్పించారు రాధికా ఆప్టే. గతంలోనూ టాలీవుడ్‌పై నిప్పులు చెరిగారు ఈ బ్యూటీ.




