- Telugu News Photo Gallery Cinema photos Singer Geetha Madhuri and Nandu name their son Dhruvadheer Tarak in naming ceremony
Geetha Madhuri: గ్రాండ్‌గా గీతా మాధురి కుమారుడి బారసాల ఫంక్షన్.. బాబుకి ఏం పేరు పెట్టారో తెలుసా?
టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన సింగర్ గీతా మాధురి, నటుడు నందు రెండోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఇటీవలే గీతా మాధురి పండంటి మమగ బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 10 తమకు కుమారుడు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారీ లవ్లీ కపుల్.
Updated on: Mar 04, 2024 | 12:18 PM

టాలీవుడ్ క్యూట్ కపుల్స్ లో ఒకరైన సింగర్ గీతా మాధురి, నటుడు నందు రెండోసారి అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఇటీవలే గీతా మాధురి పండంటి మమగ బిడ్డకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 10 తమకు కుమారుడు జన్మించినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారీ లవ్లీ కపుల్.

తాజాగా ఈ దంపతులు తమ కుమారుడి బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు, సన్నిహితులు, ఇండస్ట్రీ స్నేహితులు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

ఇక తమ బుడ్డోడికి ధ్రువధీర్ తారక్ అని నామకరణం చేశారు గీతా మాధురి దంపతులు. ప్రస్తుతం ఈ బారసాల వేడుకకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

బుడ్డోడే కాదు, పేరు కూడా భలే క్యూట్ గా ఉందంటూ బారసాల వేడుకకు హాజరైన సెలబ్రిటీలు అభిప్రాయపడుతున్నారు. గీత, నందులది ప్రేమ వివాహం. 2014లో వీరి వివాహం గ్రాండ్ గా జరిగింది.

తమ ప్రేమ, అన్యోన్యత బంధానికి గుర్తింపుగానే 2019లో గీతా మాధురి- నందు దంపతులకు దాక్షాయని ప్రకృతి అనే కూతురు పుట్టింది. ఇప్పుడు మగ బిడ్డ కూడా జన్మించాడు.