Sound Party OTT: ఆహాలో మోగనున్నసౌండ్ పార్టీ.. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో వీజే సన్నీ ఒకరు. పలు సీరియల్స్ లో నటించిన అతను బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ విజేతగా నిలిచాడు. అలాగే అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడదే క్రేజ్ తో . సక్సెస్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్

Sound Party OTT: ఆహాలో మోగనున్నసౌండ్ పార్టీ.. బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Vj Sunny's Sound Party Movie
Follow us
Basha Shek

|

Updated on: Mar 05, 2024 | 12:02 PM

తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో వీజే సన్నీ ఒకరు. పలు సీరియల్స్ లో నటించిన అతను బిగ్ బాస్ తెలుగు 5వ సీజన్ విజేతగా నిలిచాడు. అలాగే అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడదే క్రేజ్ తో . సక్సెస్, ఫ్లాఫ్‌లతో సంబంధం లేకుండా హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అలా వీజే సన్నీ హీరోగా నటించిన సినిమా సౌండ్ పార్టీ. దర్శకుడు సంజయ్ షేరి తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ లో హృతిక శ్రీనివాస్ హీరోయిన్ గా నటించింది. శివన్నారాయణ, పృథ్విరాజ్, అలీ, సప్తగిరి కీలకపాత్రలు పోషించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్లలో విడుదలైన సౌండ్ పార్టీ పెద్దగా సౌండ్ చేయలేదు. ప్రమోషన్లు సరిగా లేకపోవడంతో జనాల్లోకి పెద్దగా ఎక్కలేదు. దీంతో మోస్తరు కలెక్షన్లకే పరిమితమైంది సౌండ్ పార్టీ. థియేటర్లలో పెద్దగా మెప్పించని ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. సౌండ్ పార్టీ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మార్చి 8వ తేదీ నుంచి వీజే సన్నీ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది ఆహా ఓటీటీ.

‘సౌండ్ డీటీఎస్‍లో మోగిద్దామా. ఆహాలో సౌండ్ పార్టీ. మార్చి 8న ప్రీమియర్ కానుంది’ అని ఆహా ట్వీట్ చేసింది. బ్రైట్ కామెడీ మూవీ అంటూ మూవీకి సంబంధించి కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో హీరో వీజే సన్నీతో పాటు హీరోయిన్ హృతికా శ్రీనివాస్, శివన్నారాయణ తదితరులు ఈ పోస్టర్‌లో కనిపించారు. ఫుల్ మూన్ మీడియా పతాకంపై రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర సంయుక్తంగా సౌండ్ పార్టీ సినిమాను నిర్మించారు. మదన్ సంగీతం అందించారు. అలాగే శ్రీనివాస్ జే రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.

ఇవి కూడా చదవండి

మహా శివరాత్రి కానుకగా స్ట్రీమింగ్..

ఆహాలో ఇతర సినిమాలు…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.