Breathe OTT: ‘ఆహా’లో నందమూరి హీరో థ్రిల్లర్ మూవీ .. ‘బ్రీత్’ స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన చిత్రం బ్రీత్. వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వం తెరకెక్కించిన ఈ మెడికో థ్రిల్లర్ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన బ్రీత్ ఆడియెన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది.
నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన చిత్రం బ్రీత్. వంశీకృష్ణ ఆకేళ్ల దర్శకత్వం తెరకెక్కించిన ఈ మెడికో థ్రిల్లర్ సినిమాలో వైదిక సెంజలియా హీరోయిన్‌గా నటించింది. వెన్నెల కిషోర్, కేశవ్ దీపక్, మధు నారాయణ్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది డిసెంబర్ 2న థియేటర్లలో విడుదలైన బ్రీత్ ఆడియెన్స్ ను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. సినిమాపై బజ్ లేకపోవడం, సరైన ప్రమోషన్లు లేకపోవడంతో బ్రీత్ డిజాస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద కనీసం వసూళ్లు కూడా రాబట్టలేకపోయింది. దీనికి తోడు బ్రీత్ రిలీజైన టైమ్‌లోని యానిమల్, హాయ్ నాన్న వంటి క్రేజీ సినిమాలు థియేటర్లలోకి అడుగుపెట్టాయి. దీంతో బ్రీత్ ను తెలుగు ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన బ్రీత్ సుమారు మూడు నెలల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ థ్రిల్లర్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మహా శివరాత్రి కానుకగా మార్చి 8 నుంచి బ్రీత్ సినిమాను ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసింది ఆహా. అలాగే సినిమాకు సంబంధించి ఒక కొత్త పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
ఇక బ్రీత్ సినిమా విషయానికొస్తే… రాష్ట్ర ముఖ్యమంత్రి అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరుతాడు. ఆయనను చంపడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యమంత్రిని కాపాడేందుకు ఓ సాధారణ యువకుడు ఏం చేశాడు? అసలు అతను ఎవరు? ముఖ్యమంత్రితో ఉన్న సంబంధం ఏమిటి అన్నదే బ్రీత్ మూవీ కథ. మరి థియేటర్లలో నిరాశపర్చిన ఈ సినిమా ఓటీటీలోనైనా మంచి రెస్పాన్స్ అందుకుంటుందో లేదో చూడాలి.
శివరాత్రి రోజే స్ట్రీమింగ్..
Intense thriller!👉
Nandamuri chai ‘Breath’ on aha!!🤘 #Breathe Premieres March 8. pic.twitter.com/KyZHTQ3Pye
— ahavideoin (@ahavideoIN) March 4, 2024
ఆహాలో స్ట్రీమింగ్ అవుతోన్న ఇతర సినిమాలు, షోస్ ఇవే..
Dushyanth Katikineni’s ultra-edgy social thriller includes five-star performances from a superb cast. #AmbajipetaMarriageband @ahavideoIN @ActorSuhas 82. Ambajipeta Marriage Band; movie review https://t.co/hSGxuD9K7X pic.twitter.com/Ft7LOxE1w7
— neil white (@everyfilmneil) March 4, 2024
Sound DTS lo mogiddama!🔊#SoundParty on aha!!
Premieres March 8.@VJSunnyOfficial @Hrithika_S @sanjaysheri @polishettyravi @vjayashankarr @sivannarayana_ @MohithRahmaniac @FullmoonMediaTX @GoliSodaDigital @GKCinemaPro @adityamusic pic.twitter.com/kKyds3L670
— ahavideoin (@ahavideoIN) March 4, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.