Ae Watan Mere Watan OTT: డైరెక్టుగా ఓటీటీలోకి సారా అలీఖాన్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోన్న సారా అలీఖాన్ మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటిస్తోంది. అలా ఆమె నటించిన ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే ఏ వతన్‌ మేరే వతన్‌. ఇందులో సారాతో పాటు ఇమ్రాన్‌ హష్మి, సచిన్‌ ఖేడ్కర్‌, అభయ్‌ వర్మ, స్పార్ష్‌ శ్రీవాత్సవ, అలెక్స్‌ ఓ నేలి, ఆనంద్‌ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

Ae Watan Mere Watan OTT: డైరెక్టుగా ఓటీటీలోకి సారా అలీఖాన్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పుడు, ఎక్కడంటే?
Sara Ali Khan
Follow us
Basha Shek

|

Updated on: Mar 05, 2024 | 1:06 PM

ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా చేస్తోన్న సారా అలీఖాన్ మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లోనూ నటిస్తోంది. అలా ఆమె నటించిన ఒక ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ డైరెక్టుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అదే ఏ వతన్‌ మేరే వతన్‌. ఇందులో సారాతో పాటు ఇమ్రాన్‌ హష్మి, సచిన్‌ ఖేడ్కర్‌, అభయ్‌ వర్మ, స్పార్ష్‌ శ్రీవాత్సవ, అలెక్స్‌ ఓ నేలి, ఆనంద్‌ తివారీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కరణ్‌జోహార్‌ నిర్మించిన ఈ సినిమాను కణ్ణన్‌ అయ్యర్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఏ వతన్‌ మేరే వతన్‌ డైరెక్టుగా డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ అమెజాన్ ప్రైమ్ వేదికగా మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, మరాఠి, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఏ వతన్‌ మేరే వతన్‌ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సమర యోధురాలు ఉషా మెహతా జీవిత కథ ఆధారంగా ‘ఏ వతన్ మేరే వతన్’ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఉషా మెహతాగా సారా అలీ ఖాన్ నటించగా.. రామ్ మనోహర్ లోహియా పాత్రను ఇమ్రాన్ హష్మి పోషించారు. ‘స్వాతంత్ర్య పోరాటంలో రేడియో ఎంతో కీలక పాత్ర పోషించింది. వార్తలు అందజేయడానికి, సమాచారాన్ని చేరవేయడంతో పాటు, ఉద్యమకారుల్లో స్ఫూర్తిని రగిలించడానికి ఎంతగానో ఉపయోగపడింది. అలాంటి ఇతివృత్తంతో రూపొందిన ఈ మూవీని ప్రపంచ రేడియో దినోత్సవం పురస్కరించుకుని మార్చి 21న స్ట్రీమింగ్‌కు తీసుకురావడం సంతోషంగా ఉంది’ అని కరణ్‌ జోహార్‌ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తెలిపింది. ఏ వతన్ మేరే వతన్ చిత్రానికి కన్నన్, దరాబ్ ఫారూకీ రచయితలుగా వ్యవహించారు. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‍మెంట్ పతాకంపై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమన్ మెహతా ఈ చిత్రాన్ని నిర్మించారు.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

సారా అలీఖాన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.