Sundaram Master OTT: రెండు ఓటీటీల్లోకి వైవా హర్ష ‘సుందరం మాస్టర్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం సుందరం మాస్టర్. మాస్ మహరాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించడం, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై బజ్ పెంచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ప్రమోషన్లలో పాల్గొనడంతో సుందరం మాస్టర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి.
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం సుందరం మాస్టర్. మాస్ మహరాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించడం, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై బజ్ పెంచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి స్టార్ హీరోలు ప్రమోషన్లలో పాల్గొనడంతో సుందరం మాస్టర్ సినిమాపై మంచి అంచనాలు ఏర్పాడ్డాయి. అందుకు తగ్గట్టుగానే ఫిబ్రవరి 23న థియేటర్లలో విడుదలైన సుందరం మాస్టర్ యావరేజ్ గా నిలిచింది. ఎప్పటిలాగే వైవా హర్ష తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడని ప్రశంసలు వచ్చాయి. తక్కవ బడ్జెట్ మూవీ కావడంతో నిర్మాతలకు బాగానే లాభాలు వచ్చినట్లు సమాచారం. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన సుందరం మాస్టర్ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఏకంగా రెండు ఓటీటీల్లోనూ వైవా హర్ష సినిమా అందుబాటులోకి రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఆహాతో పాటు ఈటీవీ విన్ లో ఈ లేటెస్ట్ కామెడీ ఎంటర్ టైనర్ స్ట్రీమింగ్ కానుంది. బహుశా మార్చి 21 నుంచి లేదా మార్చి 22 నుంచి ఈ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి రానుందని టాక్ నడుస్తోంది. త్వరలోనే సుందరం మాస్టర్ ఓటీటీ రిలీజ్ డేట్ పై అధికారిక సమాచారం వెలువడనున్నట్లు సమాచారం.
సుందరం మాస్టర్ కథ ఏంటంటే?
సుందరం మాస్టర్ సినిమాతో కల్యాణ్ సంతోష్ డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆర్‌టీ టీమ్ వర్క్స్ బ్యానర్‌పై రవితేజ ఈ సినిమాను నిర్మించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే..అడవి మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే ఊరివాళ్లు తమకు ఇంగ్లిష్ టీచర్ కావాలని స్థానికి ఎమ్మెల్యేను అభ్యర్థిస్తారు. దీంతో ఆ ఊరికి సుందరం మాస్టర్‌ను టీచర్‌గా పంపిస్తాడు ఎమ్మెల్యే. అయితే ఊరిలోని వారందరూ గడగడ ఇంగ్లిష్ మాట్లాడుతూ సుందరం మాస్టారుకే ఎదురు పరీక్ష పెడతారు. ఇందులో ఫెయిలయితే ఉరి తీసి చంపేస్తామని సుందరం మాస్టారును బెదిరిస్తారు. మరి ఆ టెస్ట్‌లో సుందరం మాస్టర్ పాసయ్యాడా? అసలు ఎమ్మెల్యే సుందరం మాస్టారను ఎందుకు ఆ పల్లెటూరుకు పంపాడు? ఆ ఊరిలో ఉన్న ఓ విలువైన వస్తువు ఆచూకీ సుందరం మాస్టర్ కనిపెట్టాడా? లేదా? అన్నదే తెలుసుకోవాలంటే సుందరం మాస్టర్ సినిమా చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.