T20 World Cup 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మొబైల్‌లో ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు.. ఎక్కడంటే?

క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ శుభవార్త చెప్పింది. T20 వరల్డ్ కప్ 2024 మ్యాచలన్నింటినీ ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సదుపాయం మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మీరు ల్యాప్‌టాప్ లేదా టీవీలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ని ఉపయోగిస్తే ఉచిత లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండదు. బదులుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

T20 World Cup 2024: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మొబైల్‌లో ఫ్రీగా టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు.. ఎక్కడంటే?
T20 World Cup 2024
Follow us
Basha Shek

|

Updated on: Mar 05, 2024 | 1:33 PM

క్రికెట్ అభిమానులకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ శుభవార్త చెప్పింది. T20 వరల్డ్ కప్ 2024 మ్యాచలన్నింటినీ ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సదుపాయం మొబైల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే మీరు ల్యాప్‌టాప్ లేదా టీవీలో ఓటీటీ ప్లాట్ ఫామ్‌ ని ఉపయోగిస్తే ఉచిత లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉండదు. బదులుగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ డిస్నీ హాట్‌స్టార్ T20 వరల్డ్ కప్ 2024ని ఉచితంగా స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఇంతకుముందు, డిస్నీ హాట్‌స్టార్ 2023 ODI ప్రపంచ కప్‌ను మొబైల్ వినియోగదారులకు ఉచితంగా ప్రసారం చేసింది. ఇప్పుడు జరగబోయే టీ20 ప్రపంచకప్ కూడా మొబైల్స్‌లో ఉచిత లైవ్ స్ట్రీమింగ్ ఉంటుందని డిస్నీ కంపెనీ తెలిపింది.

జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ జూన్ 29న జరగనుంది. ఆతిథ్య అమెరికా, కెనడా తొలి మ్యాచ్‌ ఆడనున్నాయి. జూన్ 5న భారత జట్టు ప్రపంచకప్‌ పోరాటాన్నిప్రారంభిస్తుంది. తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడనుంది. అలాగే జూన్ 9న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు న్యూయార్క్‌ ఆతిథ్యం ఇవ్వనుంది.

ఇవి కూడా చదవండి

2024 T20 ప్రపంచ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం 55 మ్యాచ్ లు జరగనున్నాయి. జట్లను ఐదు చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. టెస్ట్ ఆడే దేశాలతో పాటు, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, ఉగాండా, పపువా న్యూ గినియా, నెదర్లాండ్స్ మరియు నేపాల్ కూడా ICC ఈవెంట్‌లో పాల్గొంటాయి. ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్ 8కి అర్హత సాధిస్తాయి, ఆ తర్వాత సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి.

టీమిండియా షెడ్యూల్‌..

  • జూన్ 5: భారతదేశం vs ఐర్లాండ్, నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
  • జూన్ 9: భారతదేశం vs పాకిస్తాన్ , నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
  • జూన్ 12: భారతదేశం vs యునైటెడ్ స్టేట్స్, నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం, న్యూయార్క్
  • జూన్ 15: ఇండియా vs కెనడా, సెంట్రల్ బ్రోవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్, లాడర్‌హిల్, ఫ్లోరిడా (మ్యాచ్‌ లన్నీ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి)

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..