IND Vs ENG: ‘మూడు ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషించింది. ఆమెకే అంకితం’.. వందో టెస్టుపై జానీ బెయిర్ స్టో ఎమోషనల్
ఏ క్రికెటర్ కైనా 100 టెస్టులు ఆడడమనేది అరుదైన ఘనతే. ఇప్పుడు అశ్విన్, బెయిర్ స్టో ఈ మైలురాయిని అందుకోనున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ తరఫున వందో టెస్టు ఆడనున్న 17వ ప్లేయర్ గా రికార్డులకెక్కనున్నాడు బెయిర్ స్టో. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంగ్లండ్ బ్యాటర్ ఎమోషనల్ అయ్యాడు.

ధర్మశాలలో వందో టెస్టు ఆడనున్న జానీ బెయిర్ స్టో.. మా అమ్మకు అంకితమంటోన్న ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు 3-1తో ఇప్పటికే దక్కించుకుంది. దీంతో గురువారం (మార్చి7) నుంచి ధర్మశాల వేదికగా ప్రారంభమయ్యే ఐదో టెస్టు నామమాత్రమే కానుంది. అయితే ఈ ఐదో టెస్టు ఇద్దరు ఆటగాళ్లకు మాత్రం చాలా స్పెషల్. వారెవరో కాదు టీమిండియా స్టార్ స్నిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, అలాగే ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో. ధర్మశాల మ్యాచ్‌తో వీరిద్దరూ తమ కెరీర్‌లో 100వ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నారు. ఏ క్రికెటర్ కైనా 100 టెస్టులు ఆడడమనేది అరుదైన ఘనతే. ఇప్పుడు అశ్విన్, బెయిర్ స్టో ఈ మైలురాయిని అందుకోనున్నారు. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ తరఫున వందో టెస్టు ఆడనున్న 17వ ప్లేయర్ గా రికార్డులకెక్కనున్నాడు బెయిర్ స్టో. ఈ సందర్భంగా మాట్లాడిన ఇంగ్లండ్ బ్యాటర్ ఎమోషనల్ అయ్యాడు. ‘నేను ఆడేటప్పుడు నా గురించి కంటే నాన్న గురించి ఆలోచించిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. మా నాన్న ఆత్మహత్య చేసుకున్నప్పుడు నాకు కేవలం 8 ఏళ్లు మాత్రమే. ఆ సమయంలో మూడు ఉద్యోగాలు చేసి మమ్మల్ని పోషించింది మా అమ్మ. రెండు సార్లు రొమ్ము క్యాన్సర్ వేధించినా సంకల్ప బలంతో బయట పడింది. అందుకే నా వందో టెస్టును మా అమ్మకే అంకితం చేయాలనుకుంటున్నాను’ అని బెయిర్ స్టో చెప్పుకొచ్చాడు.
‘నేను వన్డే క్రికెట్ చూస్తూ పెరగలేదు, నేను టెస్ట్ క్రికెట్ చూస్తూ పెరిగాను. అదే నాకు సర్వస్వం. నేను మైఖేల్ వాన్, మార్కస్ ట్రెస్కోథిక్, కెవిన్ పీటర్సన్ ల ఆటను ఆరాధిస్తాను. ఈ వారం నేను వందో టెస్టు ఆడుతున్నాను. ఈ సందర్భాన్ని మనసారా ఆస్వాదించాలనుకుంటున్నాను. ప్రపంచవ్యాప్తంగా మమ్మల్ని అనుసరించే అద్భుతమైన అభిమానుల కోసం కుర్రాళ్లతో కలిసి మంచి ప్రదర్శన ఇవ్వాలనుకుంటున్నాను’ అని తెలిపాడు బెయిర్ స్టో.
మానాన్న చనిపోయినా..
Bairstow said “My 100th Test Cap is for my mother, my mum is the embodiment of strength – she worked three jobs & had two kids that were under 10 at difficult time – She had cancer twice, she is a bloody strong woman to get through that twice”. [Telegraph Sport] pic.twitter.com/JcWiPX9gIw
— Johns. (@CricCrazyJohns) March 4, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








