Allu Arjun: అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి బంధానికి పదమూడేళ్లు.. భార్యకు బన్నీ ఎలా విషెస్ చెప్పాడో చూశారా?

సినిమాల సంగతి పక్కన పెడితే.. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తాడు బన్నీ. సమయమొచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు, టూర్లకు వెళుతుంటాడు. ఇదిలా ఉంటే బుధవారం (మార్చి06) అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాడు ఐకాన్ స్టార్. తన భార్యతో కలిసున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ..

Allu Arjun: అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి బంధానికి పదమూడేళ్లు.. భార్యకు బన్నీ ఎలా విషెస్ చెప్పాడో చూశారా?
Allu Arjun Family
Follow us
Basha Shek

|

Updated on: Mar 06, 2024 | 11:50 AM

అల్లు అర్జున్.. ప్రస్తుతం ఇండియాలోని మోస్ట్ పాపులర్ హీరోల్లో ఒకరు. ముఖ్యంగా పుష్ప సినిమా బన్నీ క్రేజ్‌ను, పాపులారిటీని అమాంతం పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోన్న పుష్ప 2 ది రూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు అల్లు అర్జున్. సినిమాల సంగతి పక్కన పెడితే.. కుటుంబానికి ఎంతో ప్రాధాన్యమిస్తాడు బన్నీ. సమయమొచ్చినప్పుడల్లా కుటుంబ సభ్యులతో వెకేషన్లు, టూర్లకు వెళుతుంటాడు. ఇదిలా ఉంటే బుధవారం (మార్చి06) అల్లు అర్జున్, స్నేహారెడ్డిల వివాహ వార్షికోత్సవం. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా తన భార్యకు వెడ్డింగ్ యానివర్సరీ విషెస్ చెప్పాడు ఐకాన్ స్టార్. తన భార్యతో కలిసున్న క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మన వివాహమై 13 ఏళ్లయిపోయింది. నేను ఇలా ఉండటానికి నీతో బంధమే కారణం. నీ ప్రశాంతత నుంచి నాకు బోలెడంత ప్రేమను, శక్తిని ఇచ్చావ్. మనం ఇలా మరెన్నో వివాహ వార్షికోత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాను. హ్యాపీ వెడ్డింగ్‌ యానివర్సరీ క్యూటీ’ అని తన భార్యపై ప్రేమను కురిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్, స్నేహ దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి 2011లో పెళ్లి పీటలెక్కారు. వీరి ప్రేమ బంధానికి ప్రతీకగా అయాన్, అర్హ పుట్టారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగుతో బిజీబిజీగా ఉంటున్నాడు బన్నీ. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్. సునీల్, అనసూయ, ఫాహద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న పుష్ప 2 పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.