AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pallavi Prashanth: బర్రెలక్క బాటలోనే రైతు బిడ్డ.. పొలిటికల్ ఎంట్రీపై పల్లవి ప్రశాంత్ ఏమన్నాడంటే?

బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు రైతు బిడ్డ. సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గెటప్పులతో తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడీ బిగ్ బాస్ విన్నర్. ఈ సందర్భంగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

Pallavi Prashanth: బర్రెలక్క బాటలోనే రైతు బిడ్డ.. పొలిటికల్ ఎంట్రీపై  పల్లవి ప్రశాంత్ ఏమన్నాడంటే?
Pallavi Prashanth (Source: Pallavi Prashanth Instagram)
Basha Shek
|

Updated on: Mar 09, 2024 | 1:40 PM

Share

బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్ పుణ్యమా అని ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. కామన్ మ్యాన్ లా బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. టాప్ సెలబ్రిటీలను అధిగమించి మరీ బిగ్ బాస్ విజేతగా నిలిచాడు. అయితే ఆ తర్వాత అనుకోని సంఘటనలతో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం, విడుదల కావడం చకా చకా జరిగిపోయాయి. బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా పోస్టులతో వార్తల్లో నిలుస్తున్నాడు రైతు బిడ్డ. సందర్భానికి తగ్గట్టుగా రకరకాల గెటప్పులతో తన అభిమానులను అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తన బిగ్ బాస్ ఫ్రెండ్ ప్రిన్స్ యావర్ హీరోగా నటించిన ఓ సినిమా ఈవెంట్ కు హాజరయ్యాడీ బిగ్ బాస్ విన్నర్. ఈ సందర్భంగా తన లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

‘ఎన్ని కష్టాలు, ఇబ్బందులు వచ్చినా మనల్ని మనం నమ్ముకోవాలి. అలాగే దేవుడిని నమ్మినవాళ్లు ఎప్పుడూ చెడిపోరు. ఆ భగవంతుడే మమ్మల్ని కాపాడతాడు. ఆయన మన వెన్నంటే ఉంటాడు. మనం ముందుకు వెళ్తుంటే ఎన్నో దెబ్బలు తాకుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆత్మవిశ్వాసంతో సరే గట్టిగా నిలబడాలి. నేను అలాగే నిలబడ్డాను. ఇప్పుడిలా మీ ముందు ఇలా తిరుగుతున్నాను. ఇంకా ఎన్ని ఎదురుదెబ్బలు తాకినా సరే నేను భయపడేది లేదు. అస్సలు వెనక్కు వెళ్లను. ఇలాగే గట్టిగా నిలబడతాను. రైతుబిడ్డ తల్చుకుంటే ఏదైనా సాధిస్తాడు’ అని చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. ఇంతలో పక్కనున్న శివాజీ పార్లమెంటుకు కూడా వెళతాడు అనగా.. ‘మీ అందరి అభిమానం, ఆశీస్సులు ఉంటే అది కూడా కచ్చితంగా జరుగుతుంది. యూత్‌ మేలుకోవాలి. ముందడుగు వేయాలి. అప్పుడే సమాజం బాగుపడుతుంది’ అంటూ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చాడు ప్రశాంత్. రైతు బిడ్డ స్పీడ్ చూస్తుంటే బర్రెలక్క బాటలోనే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టవచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

శివాజీ, భోలే, ప్రిన్స్ యావర్ లతో పల్లవి ప్రశాంత్..

అభిమానులతో సెల్ఫీలు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.