Bramayugam OTT: అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి మమ్ముట్టి హిట్ మూవీ.. భ్రమయుగం స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఈ సినిమాలో కేవలం మూడే పాత్రలు ఉంటాయి. దీనికి తోడు ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో సినిమా తీసి పెద్ద సాహసమే చేశారు మేకర్స్. ఇలా ఎన్నో విశేషాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది భ్రమయుగం. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భ్రమయుగం సినిమాను విడుదల చేశారు.

Bramayugam OTT: అఫీషియల్.. అప్పుడే ఓటీటీలోకి మమ్ముట్టి హిట్ మూవీ.. భ్రమయుగం స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Mammotty's Bramayugam Movie
Follow us

|

Updated on: Mar 06, 2024 | 1:30 PM

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన లేటెస్ట్ హిట్ సినిమా భ్రమ యుగం. ఇటీవల విడుదలవుతోన్న సినిమాలతో పోల్చుకుంటే ఈ మూవీకి కాస్త ఎక్కువ క్రేజ్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమాలో కేవలం మూడే పాత్రలు ఉంటాయి. దీనికి తోడు ఈ కాలంలోనూ బ్లాక్ అండ్ వైట్ కలర్ లో సినిమా తీసి పెద్ద సాహసమే చేశారు మేకర్స్. ఇలా ఎన్నో విశేషాలతో ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది భ్రమయుగం. మొదటి షో నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత వారానికే అంటే ఫిబ్రవరి 23న తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లలో భ్రమయుగం సినిమాను విడుదల చేశారు. మలయాళంలో అంత కాకపోయినా ఇక్కడ కూడా మమ్ముట్టి సినిమాకు ఓ మోస్తరు వసూళ్లు వచ్చాయి. ఇలా థియేటర్లలో హిట్ గా నిలిచిన భ్రమయుగం సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ మమ్ముట్టి సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో మార్చి 15వ తారీఖు నుంచే భ్రమయుగం సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి తీసుకురానున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేసింది సోనీ లివ్. అలాగే ఒక వీడియోను కూడా షేర్ చేసింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ సదాశివన్ తెరకెక్కించిన భ్రమయుగం సినిమాలో అర్జున్ అశోకన్ , సిద్ధార్థ్ భరతన్, అమల్దా లిజ్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలు పోషించారు.ఈ సినిమాను నైట్ షిఫ్ట్ స్టూడియోస్‌, వైనాట్ స్టూడియోస్ బ్యానర్స్ పై చక్రవర్తి రామచంద్ర, ఎస్. శశికాంత్ సినిమాను నిర్మించారు. ‘భ్రమయుగం’ కథ సినిమా విషయానికొస్తే.. 17వ శతాబ్దంలో మలబారు తీరం. ఓ రాజ్యంలో రాజు దగ్గర గాయకుడిగా పనిచేసే దేవన్(అర్జున్ అశోకన్).. అడవిలో తప్పిపోయి కుముదన్ పొట్టి (మమ్ముట్టి) ఉంటున్న ఇంటికి వెళతాడు. అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఎన్నిసార్లు తప్పించుకోవాలని చూసినా సరే దేవన్ అక్కడి నుంచి బయటపడలేకపోతాడు. చివరకు ఏమైందన్నదే భ్రమయుగం సినిమా కథ.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ