Poonam Kaur: సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన నటి పూనమ్ కౌర్.. సంచలన ట్వీట్‌

ఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతన్నాయి. అప్పుడప్పుడు పాలిటిక్స్ పరంగానూ పోస్టులు షేర్ చేస్తుందామె. అలా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పూనమ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది

Poonam Kaur: సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన నటి పూనమ్ కౌర్.. సంచలన ట్వీట్‌
Poonam Kaur, CM Jagan
Follow us
Basha Shek

|

Updated on: Mar 06, 2024 | 2:55 PM

పూనమ్ కౌర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఒక విచిత్రం, గగనం, నాగవల్లి తదితర సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా చేరువైంది. గత కొన్నేళ్లుగా అడపాదడపా మాత్రమే మూవీస్ చేస్తోందీ అందాల తార. అదే సమయంలో సినిమాయేతర విషయాలతో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతన్నాయి. అప్పుడప్పుడు పాలిటిక్స్ పరంగానూ పోస్టులు షేర్ చేస్తుందామె. అలా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పూనమ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.’ కరోనా మహామ్మారి విజృభించిన సమయంలో చేనేత కార్మికులకు వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది. వారి కోసం చాలా మంచి పనులు చేసింది. చేనేత కార్మికుల సమస్యలపై క్రియాశీలకంగా పనిచేసే ఓ కార్యకర్తగా చెబుతున్నా ఇది చాలా గొప్ప విషయం’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చింది పూనమ్‌. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సీఎం జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఈ పోస్టుపై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు టీడీపీ, జనసేన నేతలు మాత్రం పూనమ్ ను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పూనమ్ కౌర్ షేర్ చేసిన పోస్ట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూనమ్ కౌర్ తన పర్సనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. గత రెండేళ్లుగా తాను ఫైబ్రోమైయాల్జీయా అనే ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు చెప్పి అందరికీ షాక్‌ ఇచ్చింది. ఈ వ్యాధి వల్ల దుస్తులు వేసుకునేందుకు కూడా ఇబ్బంది పడ్డానని, చికిత్స తర్వాత కూడా పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపింది పూనమ్.

పూనమ్ కౌర్ ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.