Onavillu OTT: ‘అనంతపద్మనాభ స్వామి’ ఆలయంపై డాక్యుమెంటరీ.. ఈ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్‌..

ఓటీటీల్లో సినిమాలు, సిరీస్ లతో పాటు అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంటరీలు కూడా రిలీజవుతుంటాయి. గతంలో గోదావరి నది మీద ఆహాలో వచ్చిన డాక్యుమెంటరీ అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడిదే బాటలో మరో ఆసక్తికరమైన డాక్యుమెంటరీ అందుబాటులోకి వచ్చింది. తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ ఆలయంలోని నేలమాళిగల్లోని వెలకట్టలేని సంపదలు, నిధులు ఉన్నాయని, ఇంకా ఒక గదిని తెరవలేదని వార్తలు వచ్చాయి.

Onavillu OTT: 'అనంతపద్మనాభ స్వామి' ఆలయంపై డాక్యుమెంటరీ.. ఈ ఓటీటీలో ఫ్రీగా స్ట్రీమింగ్‌..
Onavillu, The Divine Bow Documentary
Follow us
Basha Shek

|

Updated on: Mar 09, 2024 | 2:43 PM

ఓటీటీల్లో సినిమాలు, సిరీస్ లతో పాటు అప్పుడప్పుడు కొన్ని డాక్యుమెంటరీలు కూడా రిలీజవుతుంటాయి. గతంలో గోదావరి నది మీద ఆహాలో వచ్చిన డాక్యుమెంటరీ అందరి మన్ననలు అందుకుంది. ఇప్పుడిదే బాటలో మరో ఆసక్తికరమైన డాక్యుమెంటరీ అందుబాటులోకి వచ్చింది. తిరువనంతపురంలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ఆ మధ్యన ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఆ ఆలయంలోని నేలమాళిగల్లోని వెలకట్టలేని సంపదలు, నిధులు ఉన్నాయని, ఇంకా ఒక గదిని తెరవలేదని వార్తలు వచ్చాయి. నాగ బంధనం వేసి ఉండడంతో ఆ గది తెరవడానికి సాధ్యపడదని పండితులు చెబుతున్నారు. ఈ గదిలో అనంతమైన సంపద ఉందని తెలుస్తోంది. ఇలా ఎన్నో రహస్యాలు, విశేషాలతో కూడిన అనంత పద్మనాభ స్వామి ఆలయం గురించి చాలా మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడీ ఆలయం విశేషాలను, రహస్యాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ ఓటీటీలోకి వచ్చింది. అదే ‘ఒనవిల్లు: ది డివైన్ బో’. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్‌ జియో సినిమా ఈ డాక్యుమెంటరీని ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. మార్చి 8 నుంచి ఈ ఒనవిల్లు ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం మలయాళం భాషలో మాత్రమే ఈ డాక్యుమెంటరీ అందుబాటులో ఉంది. అయితే ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ ఉండడం వల్ల ఇతర భాషల వారు కూడా ఈ డాక్యుమెంటరీని చూసేయవచ్చు.

ప్రముఖ నిర్మాతలు ఆనంద్ బనారస్, శరత్ చంద్ర మోహన్‌లు ఒన విల్లు.. ది డివైన్ బ్రో డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, అలాగే యంగ్ హీరో ఉన్ని ముకుందన్‌లు ఈ డాక్యుమెంటరీకి తమ వాయిస్‌ ను అందించడం విశేషం. ఒక ఒనవిల్లు అనే పేరు విషయానికి వస్తే.. పద్మనాభస్వామి ఆలయ స్వామికి ‘ఓనవిల్లు’ అనే ఉత్సవ విల్లును సమర్పిస్తారు. త్రివేండ్రంలోని విళైల్ వీడు కరమణ సంప్రదాయ కళాకారులు ఈ విల్లును తయారు చేస్తారు. వీరినే ‘ఒన్వవిల్లు కుటుంబం’ అంటారు. సంప్రదాయం ప్రకారం ఈ విల్లును తయారుచేసే కుటుంబ సభ్యులు పనిని ప్రారంభించే ముందుకు 41 రోజుల కఠిన తపస్సు చేస్తారట. ఇలాంటి ఎన్నో విశేషాలు, వింతలను ఈ డాక్యుమెంటరీలో వీక్షించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.