Ind vs Eng: మూడో రోజుల్లోనే మడతెట్టేశారుగా.. ఆఖరి టెస్టులోనూ ఇంగ్లండ్ చిత్తు.. 4-1 తేడాతో సిరీస్ భారత్ సొంతం
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ భారత జట్టు సత్తా చాటింది. మూడు రోజుల్లోనే ఇంగ్లండ్ ను మడతెట్టేసింది. ఏకంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టును ఓడించి 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 259 పరుగుల ఇన్నింగ్స్ లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు కేవలం 195 పరుగులకే కుప్పుకూలింది
ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులోనూ భారత జట్టు సత్తా చాటింది. మూడు రోజుల్లోనే ఇంగ్లండ్ ను మడతెట్టేసింది. ఏకంగా ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టును ఓడించి 4-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. 259 పరుగుల ఇన్నింగ్స్ లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ జట్టు కేవలం 195 పరుగులకే కుప్పుకూలింది. . వందో టెస్టు ఆడుతున్న రవి చంద్రన్ అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లండ్ జట్టులో జోరూట్ () మినహా మరెవరూ పెద్దగా పరుగులు చేయలేదు. దీంతో ధర్మశాలలోనూ ఆ జట్టుకు పరాజయం తప్పలేదు. ధర్మశాల టెస్టు మ్యాచ్ మూడు రోజుల్లో ముగియడం విశేషం. ఈ సిరీస్‌లో అంతకుముందు నాలుగు మ్యాచ్‌లు నాలుగో రోజు వరకు సాగాయి. టీమ్ ఇండియా సాధించిన ఈ విజయం చాలా చారిత్రాత్మకమైనది ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌లో 112 సంవత్సరాల తర్వాత, ఒక జట్టు మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఓడి 4-1 స్కోరుతో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను గెలుచుకుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. అప్పుడు ఇంగ్లండ్ జట్టు భారత్‌ను కష్టాల్లో పడేస్తుందేమో అనిపించింది. రెండో మ్యాచ్‌లో కూడా అలాంటిదే జరిగింది కానీ ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత భారత జట్టు జోరును ఆపడం ఇంగ్లండ్ తరం కాలేదు.
మూడో రోజు మ్యాచ్‌లో టీమిండియా నిన్నటి స్కోరుతో 8 వికెట్ల నష్టానికి 473 పరుగులతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. భారత జట్టు ఖాతాలో కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేరి ఆలౌట్ అయింది. కుల్దీప్ యాదవ్‌ను ఔట్ చేయడం ద్వారా జేమ్స్ అండర్సన్ టెస్టుల్లో 700 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీని తర్వాత జస్ప్రీత్ బుమ్రాను ఔట్ చేయడం ద్వారా షోయబ్ బషీర్ భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు. దీంతో ఇంగ్లండ్‌పై భారత్ కు 259 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
టీమిండియా విజయ దరహాసం..
That series winning feeling 😃#TeamIndia 🇮🇳 complete a 4⃣-1⃣ series victory with a remarkable win 👏👏
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/vkfQz5A2hy
— BCCI (@BCCI) March 9, 2024
వందె టెస్టులో చెలరేగిన అశ్విన్..
A victory by an innings and 64 runs 👏👏
What a way to end the Test series 🙌
Scorecard ▶️ https://t.co/OwZ4YNua1o#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/uytfQ6ISpQ
— BCCI (@BCCI) March 9, 2024
మరిన్ని క్రీడా వార్తలు, కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..