Katrina Kaif: అయ్యో పాపం.. ఆ హీరోయిన్ దెబ్బకు రూ.7 కోట్లు నష్టపోయిన కత్రినా కైఫ్..
2003లో బూమ్ సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతంగా విజయం సాధించలేకపోయింది. కానీ కత్రినా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 2005లో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ క్యున్ కియా సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో కత్రినా నటనకు ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమె వెనుదిరిగి చూడలేదు. తెలుగులో వెంకటేష్ నటించి మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కత్రినా కైఫ్ ఒకరు. ఒకప్పుడు వరుస సినిమాలో బీటౌన్ లో సంచలనం సృషించిన హీరోయిన్. అందం, అభినయం, నిబద్ధతతో భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత శక్తివంతమైన అగ్రకథానాయికగా నిలిచింది. 2003లో బూమ్ సినిమాతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతంగా విజయం సాధించలేకపోయింది. కానీ కత్రినా నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో హిందీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. 2005లో సల్మాన్ ఖాన్ నటించిన మైనే ప్యార్ క్యున్ కియా సినిమాతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ మూవీలో కత్రినా నటనకు ప్రశంసలు అందుకుంది. దీంతో ఆమె వెనుదిరిగి చూడలేదు. తెలుగులో వెంకటేష్ నటించి మల్లీశ్వరి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు. హిందీలో చేతినిండా సినిమాలతో బిజీగా గడిపేసింది.
కేవలం సినిమాలే కాకుండా భారతదేశంలోని అనేక అగ్ర బ్రాండ్స్ అన్నింటికి అంబాసిడర్ గా ఉండేది. అటు వ్యాపారవేత్తగా బిజినెస్ రంగంలోనూ రాణించింది. 2023లో పెప్సికోకు చెందిన మామిడి కాయ జ్యూస్ స్లైస్ తో విడిపోవడంతో ఆమె ప్రయాణానికి ఎదురుదెబ్బ తగిలింది. లాక్మీ, L’Oreal వంటి ప్రతిష్టాత్మక బ్రాండ్‌లతో ఆమె అనుబంధానికి పేరుగాంచిన కత్రినా.. స్లైస్ బ్రాండ్ కు ఆమె ప్రధాన అంబాసిడర్ గా ఉంది. కానీ స్లైస్ నుంచి కత్రినా తప్పుకోవడంతో.. ఆమె స్థానంలోకి కియారా వచ్చి చేరింది. ఇక ఈ యాడ్ కియారాకు ఎక్కువగానే కలిసొచ్చింది.
తాజాగా స్లైస్ కు నయనతార అంబాసిడర్‌గా బాధ్యతలు స్వీకరించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటనలో నయనతార ఆకర్షణీయంగా కనిపించడం ద్వారా అభిమానులు ఆశ్చర్యపోయారు. ఈ లేడీ సూపర్ స్టార్ కత్రినా కైఫ్‌ను భర్తీ చేస్తుందనే ఊహాగానాలకు దారితీసింది. ఇదిలా ఉంటే.. కత్రినా స్లైస్ ఎండార్స్‌మెంట్ డీల్‌ను కోల్పోవడం ఆమెకు పెద్ద ఎత్తున ఆర్థిక వైఫల్యాన్ని కలిగించింది. ఈ ఒక్క బ్రాండ్ కు ఆమె రూ. 6 నుంచి రూ. 7 కోట్లు వసూలు చేసేది. కానీ ఇప్పుడు స్లైస్ తో అనుబంధం తెగిపోయింది. కత్రినా కైఫ్ చివరిసారిగా టైగర్ 3 , మెర్రీ క్రిస్మస్ చిత్రాలలో కనిపించింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




