- Telugu News Photo Gallery Lungs health tips: These Foods Help To Detox Your Lungs And Keep It Healthy
Lung Detox: ఊపిరి తిత్తులను శుభ్రం చేయడానికి, ఆరోగ్యంగా ఉంచడానికి తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి..
ప్రస్తుతం ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఊపిరితిత్తుల ఆరోగ్యం.. ఒకప్పుడు ధూమపానం చేసే వారు మాత్రమే ఎక్కువగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడతారు అనుకునేవారు. అయితే మారిన వాతావరణ పరిస్థితులతో భాగంగా అలవాట్లతో సంబంధం లేకుండా లంగ్స్ వ్యాధుల బారిన పడుతున్నారు. అయితే ఎక్కువగా ధూమపానం చేసేవారి ఊపిరితిత్తులపై నికోటిన్ ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం.
Updated on: Mar 10, 2024 | 8:15 AM

ఎక్కువగా ధూమపానం చేసేవారి ఊపిరితిత్తులపై నికోటిన్ ప్రభావం చూపిస్తుంది. తద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఊపిరితిత్తులలో పేరుకుపోయిన మురికిని శుభ్రం చేయడానికి కొన్ని ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం అవసరం.

బ్రోకలీ, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వంటి కూరగాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ కూరగాయల ఊపిరితిత్తుల నిర్విషీకరణలో సహాయపడుతుంది.

అల్లం ఊపిరితిత్తులను డిటాక్సిఫై చేయడం ద్వారా బ్రాంకైటిస్ , ఆస్తమా వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.

పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఈ సమ్మేళనం ఊపిరితిత్తుల కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది.

ఊపిరితిత్తుల నిర్విషీకరణకు గ్రీన్ టీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఈ పానీయం ఊపిరితిత్తుల పనితీరును సున్నితంగా చేస్తుంది.

వివిధ రకాల సి విటమిన్ పండ్లు అంటే నారింజ, నిమ్మ, బత్తాయి సహా ద్రాక్షలు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

దానిమ్మలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లన్నీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి.

వెల్లుల్లి కూడా ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతుంది. శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. నిర్విషీకరణలో కూడా పాత్ర పోషిస్తుంది.




