విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న ఉసిరి రసం తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఉసిరి రసం తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు, మొటిమలు దూరం అవుతాయి. ఉసిరి నూనెలో యాంటీ ఏజింగ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇవి ముడతలకు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తాయి. ప్రతిరోజూ ఉసిరి నూనెను రాసుకోవడంతో ముడతలు, ఫైన్ లైన్స్ తొలగుతాయి. తలలో చుండ్రు, దురద తగ్గుతుంది. ఉసిరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు తలలో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.