- Telugu News Photo Gallery Technology photos Xiaomi launches xiaomi 14 and xiaomi 14 ultra smart phone in india check here for full details
Xiaomi 14: షావోమీ నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్.. ధరకు తగ్గట్లే ఫీచర్స్ కూడా..
గత కొన్ని రోజులుగా బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లను లాంచ్ చేస్తూ వచ్చిన షావోమీ తాజాగా ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది. షావోమీ 14 సిరీస్ పేరుతో మార్కెట్లోకి ప్రీమియం స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. షావోమీ 14, షావోమీ 14 అల్ట్రా పేరుతో రెండు కొత్త ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Updated on: Mar 09, 2024 | 10:17 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. షావోమీ 14 సిరీస్‌లో భాగంగా షావోమీ 14, షావోమీ 14 అల్ట్రా పేరుతో రెండు ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

షావోమీ 14 స్మార్ట్ ఫోన్‌లో 6.36 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఇక షావోమీ 14 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 6.73 ఇంచెస్‌తో కూడిన క్యూహెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. షావోమీ 14ని మెటా బ్లాక్, క్లాసిక్ వైట్, జేడ్ గ్రీన్ కలర్స్‌లో షావోమీ 14 అల్ట్రాని బ్లాక్, వైట్ కలర్స్‌లో తీసుకొచ్చారు.

ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్స్‌లో కూడా ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఓఎస్‌తో పనిచేస్తాయి. 14లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను 14 అల్ట్రాలో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ను అందించారు.

షావోమీ 14లో 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 610 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. అలాగే షావోమీ 14 అల్ట్రాలో 90 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు, 50 వాట్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5300 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.

కెమెరా విషయానికొస్తే 14లో 50 ఎంపీ రెయిర్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను అందించారు. ఇక షావోమీ 14 అల్ట్రా 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 99,999కాగా, షావోమీ 14, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ధర రూ. 69,999గా ఉంది. మార్చి 11వ తేదీ నుంచి సేల్స్ ప్రారంభంకానున్నాయి.




