- Telugu News Photo Gallery Technology photos Tecno spark 20c smartphone sales starts in amazon check here for full details
Tecno Spark 20C: అమెజాన్‌లో టెక్నో స్పార్క్ 20సీ సేల్స్.. రూ. 8వేలకే స్టన్నింగ్ ఫోన్..
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో ఇటీవల కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. టెక్నో స్పార్క్ 20సీ పేరుతో తీసుకొచ్చిన బడ్జెట్ ఫోన్ సేల్స్ అమెజాన్‌లో తాజాగా ప్రారంభమయ్యాయి. లాంఇచంగ్ ఆఫర్‌లో భాగంగా ఈ స్మార్ట్ ఫోన్‌పై వెయ్యి రూపాయాలు డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి..
Updated on: Mar 09, 2024 | 9:41 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో ఇటీవల భారత మార్కెట్లోకి టెక్నో స్పార్క్ 20 సీపేరుతో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ సేల్స్ తాజాగా మార్చి 5వ తేదీ నుంచి అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి.

టెక్నో స్పార్క్ 20సీ స్మార్ట్ ఫోన్ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 8,999కాగా, లాచింగ్ ఆఫర్లో భాగంగా రూ. 7,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

అలాగే ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.5,604 విలువైన ఓటీటీ ప్లే వార్షిక సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ స్క్రీన్ అందించారు.

రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ ఈ డిస్‌ప్లే సొంతం. యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహాలో ఇందులో డైనమిక్ పోర్టు అందించారు. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇందులో చూసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు. కేవలం 50 నిమిషాల్లోనే 0 నుంచి 50 శాతం వరకు ఛార్జింగ్ అవుతుంది.




