AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vietnam Man: గొంతు నొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళ్లిన వ్యక్తి.. మెడలో జలగ ఉందని గుర్తింపు..

వియాత్నం కు చెందిన వ్యక్తికి గొంతు సమస్య వచ్చి, గద్గద స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు. దీనికి కారణం తన గొంతులో 6 సెంటీమీటర్ల పొడవైన జలగ ప్రవేశించి రక్తాన్ని పీలుస్తోందని అతనికి తెలిసింది. జలుబు బారిన పడితే గొంతు మూసుకుపోతుంది.. స్వరం బొంగురుపోవడం సర్వసాధారణం.  అయితే ఆ బొంగురుతనం పరిణామాలు చాలా భయంకరంగా మారితే ఎలా ఉంటుంది? ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు 53 ఏళ్ల వియత్నామీస్ వ్యక్తి.

Vietnam Man: గొంతు నొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళ్లిన వ్యక్తి.. మెడలో జలగ ఉందని గుర్తింపు..
Vietnam Man
Surya Kala
|

Updated on: Mar 10, 2024 | 12:25 PM

Share

ఒక్కోసారి ఇలాంటి కొన్ని వైద్య సంబంధిత కేసులు వెలుగులోకి రావడం, ప్రజలనే కాదు వైద్యులనూ దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. సాధారణంగా ఒక కీటకం కరిచినా లేదా వ్యక్తుల శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినా వెంటనే మనం దాని గురించి తెలుసుకుంటాం.. అదే ఆ పురుగు ఒక జలగ అయితే దీని  గురించి తెలుసుకోవడం సహజం. అయితే వియత్నాంలో జరిగిన ఒక ఘటన వెలుగులోకి రావడం అందరినీ కలిచివేసింది. వాస్తవానికి  వియాత్నం కు చెందిన వ్యక్తికి గొంతు సమస్య వచ్చి, గద్గద స్వరంతో మాట్లాడటం ప్రారంభించాడు. దీనికి కారణం తన గొంతులో 6 సెంటీమీటర్ల పొడవైన జలగ ప్రవేశించి రక్తాన్ని పీలుస్తోందని అతనికి తెలిసింది.

జలుబు బారిన పడితే గొంతు మూసుకుపోతుంది.. స్వరం బొంగురుపోవడం సర్వసాధారణం.  అయితే ఆ బొంగురుతనం పరిణామాలు చాలా భయంకరంగా మారితే ఎలా ఉంటుంది? ఈ అనుభవాన్ని ఎదుర్కొన్నాడు 53 ఏళ్ల వియత్నామీస్ వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే..

వాస్తవానికి ఈ 53 ఏళ్ల వియత్నామీస్ వ్యక్తికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దీంతో గురక, గొంతు నొప్పితో ఇబ్బంది పడ్డాడు. అయితే తేలికపాటి జలుబు అని మొదట భావించాడు. అయితే అతను నోటి నుంచి రక్తం రావడం మొదలైంది. ఆ తర్వాత తనకు వచ్చింది కేవలం జలుబు మాత్రమే కాదని అర్థమైంది. అటువంటి పరిస్థితిలో అతను భయపడ్డాడు..  నేరుగా డాక్టర్ వద్దకు వెళ్లాడు. అక్కడ ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఎందుకంటే అతని మెడలో జలగ ఉన్నట్లు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

గొంతు సమస్య తర్వాత బయటపడ్డ షాకింగ్ సీక్రెట్

ఆ వ్యక్తి గొంతులో నొప్పి, రక్తం పడుతుందని.. హనోయిలోని నేషనల్ హాస్పిటల్ ఆఫ్ ఎండోక్రినాలజీకి వెళ్ళాడు. అప్పుడు వైద్యులు ఎండోస్కోపీని నిర్వహించగా అతని మెడ లోపల 6 సెంటీమీటర్ల పొడవైన జలగ ఉందని తేలిందని ఆడిటీ సెంట్రల్ నివేదించింది. అది మెడలో గట్టిగా ఇరుక్కుపోయింది. ఇది శ్వాసనాళానికి సమీపంలో గ్లోటిస్ క్రింద ఉందని వైద్యులు వెల్లడించారు. అనంతరం వైద్యులు అతని గొంతులోని జలగను ఆపరేషన్ చేసి తొలగించారు.

రక్తం పీల్చే జలగ గొంతులోకి ఎలా ప్రవేశించిందంటే

ఒక నెల క్రితం.. ఒక సందర్భంలో ఆ వ్యక్తి చేతికి గాయమైంది. ఆ గాయాన్ని నయం చేసుకోవడానికి ఇంటి ఆవరణలో ఉన్న కొన్ని ఔషధ మొక్కల ఆకులను తీసుకొని వాటిని నమిలి ముద్దలా చేసి చేతికి ఉన్న గాయంపై పూసాడు. దీంతో అతని చేతికి అయిన గాయం నయం అయింది. అయితే అతని గొంతులో సమస్య మొదలైంది. అయితే అతను నోట్లో పెట్టుకున్న ఆకులో జలగ దాగి ఉంది.. అది నోటిలోకి ప్రవేశించి  ఇబ్బందులను కలిగించిందని వైద్యులు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో
జక్కన్న కోసం.. యుద్ధవిద్యలో శిక్షణ పొందిన మహేష్‌ వీడియో
బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.
బాహిర్బుమికి వెళ్తానని కారు ఆపిన బాలుడు.. కాసేపటికే సీన్ మారింది.
మరో ఐదు రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే రూ.వెయ్యి ఫైన్
మరో ఐదు రోజులే టైమ్.. ఈ పని చేయకపోతే రూ.వెయ్యి ఫైన్
ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. గుర్తు పట్టారా?
ఈ కాలేజీ బుల్లోడు ఇప్పుడు టాలీవుడ్ సెన్సేషన్.. గుర్తు పట్టారా?
ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్
ధురంధర్ కలెక్షన్స్‌లో షేర్ కావాలి.. పాకిస్తానీల వింత డిమాండ్
Year Ender 2025: ఈ ఏడాది టీమిండియా తోపు ప్లేయర్ ఇతనే..
Year Ender 2025: ఈ ఏడాది టీమిండియా తోపు ప్లేయర్ ఇతనే..
రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్ వీడియో
రిలీజ్‌కు ముందే ఛాంపియన్ రికార్డ్.. భారీ ధరకు ఓటీటీ డీల్ వీడియో
2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
2026లో దేశంలో జరగబోయే మార్పులు ఇవే.. తెలుసుకోకపోతే మీకే నష్టం!
ట్రాఫిక్ చలానా కడదామని క్లిక్ ఇచ్చాడు.. కట్ చేస్తే..
ట్రాఫిక్ చలానా కడదామని క్లిక్ ఇచ్చాడు.. కట్ చేస్తే..
'రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం ' : దువ్వాడ వీడియో
'రమ్య మోక్షకు బిగ్‌బాస్ అన్యాయం ' : దువ్వాడ వీడియో