Viral News: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేశాడు.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంకే..!

దీంతో విమానయాన సంస్థకు నష్టం వాటిల్లడమే కాకుండా ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అనాగరిక చర్యలు సరికాదని ప్రయాణికులను హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Viral News: ఇలా ఉన్నారేంట్రా బాబూ.. విమానం ఇంజిన్‌లో కాయిన్స్ వేశాడు.. ఎందుకో తెలిస్తే మైండ్ బ్లాంకే..!
Passenger Tossing Coins In Flight Engine
Follow us

|

Updated on: Mar 10, 2024 | 12:57 PM

విమానాల్లో జరిగే అనేక సంఘటనలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. తమాషా, విచిత్రమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటనలు తరచుగా విమానాల్లో జరుగుతుంటాయి. దీనికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చలికాలంలో చెడు వాతావరణం కారణంగా చాలా సార్లు విమానాలు ఆలస్యమవుతాయి. కొన్ని సందర్భాల్లో రద్దు చేయబడతాయి. కొన్నిసార్లు ప్రతికూల వాతావరణం కారణంగా, మరి కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల విమానాలు ఆలస్యమవుతాయి. అయితే ఒక ప్రయాణికుడు ఇంజిన్‌లో నాణెం పడేసినందుకు విమానం ఆలస్యం కావడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? కానీ అది జరిగింది. నాణెం కారణంగా విమానం 4 గంటలపాటు నిలిచిపోయింది.

మార్చి 6న సాన్యా నుంచి బీజింగ్ వెళ్తున్న చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 10 గంటలకు విమానం టేకాఫ్ కావాల్సి ఉంది. కానీ, ఒక ప్రయాణికుడు చేసిన ఒక వింత ఘటన కారణంగా దాదాపు 4 గంటలపాటు విమానం ఆలస్యమైంది. విమానం ఆలస్యం కావడానికి గల కారణం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందా అని విమానంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఓ వ్యక్తి విమానం ఇంజిన్‌లోకి కాయిన్స్ విసిరినట్లు కనిపించింది. విమాన సిబ్బంది అతన్ని ప్రశ్నించగా అసలు విషయం చెప్పాడు. 5 కాయిన్స్ ఇంజిన్‌లోకి విసిరినట్లు సదరు ప్రయాణికుడు అంగీకరించాడు. దాంతో ఉదయం 10 గంటలకే బయలుదేరాల్సిన విమానం.. మధ్యాహ్నం 2:16 గంటలకు బయలుదేరింది. అయితే, దీని వెనుక కారణం తెలియటంతో వారంతా అవక్కాయ్యారు.

సదరు ప్రయాణికుడు నాణేలను విమానం ఇంజిన్‌లో వేయడానికి షాకింగ్ రీజన్ చెప్పాడు. అలా నాణేలను విమానం ఇంజిన్‌లో వేస్తే అతనికి అదృష్టం వరిస్తుందట. ఆ నమ్మకం కారణంగానే.. అతను నాణేలను విమానం ఇంజిన్‌లో వేశాడట. విమానం ఇంజిన్ వైఫల్యం కారణంగా ఫ్లైట్ ఆలస్యం అయింది. దీంతో విమానయాన సంస్థకు నష్టం వాటిల్లడమే కాకుండా ఈ విమానంలో ప్రయాణించే ప్రయాణికులంతా తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటనపై చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అనాగరిక చర్యలు సరికాదని ప్రయాణికులను హెచ్చరించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దాంతో ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..