AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిబ్బంది క్వార్టర్స్‌కు చేరిన చిరుత ఫ్యామిలీ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే గుండె గుభేల్..

అయితే మిగిలిన మూడు చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపటి తర్వాత మరో రెండు చిరుతలు గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి దూకివెళ్లిపోయాయి.. కానీ ఒక చిరుతపులి గేటు పైన కూర్చొని ఉంది. కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత దూకేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.. ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.

సిబ్బంది క్వార్టర్స్‌కు చేరిన చిరుత ఫ్యామిలీ.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే గుండె గుభేల్..
Leopards
Jyothi Gadda
|

Updated on: Mar 10, 2024 | 12:11 PM

Share

ప్రస్తుతం అడవుల విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. దాంతో నగరంతోపాటు పల్లెల్లో చిరుతపులులు, ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అడవి జంతువుల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా, మానవ, జంతువుల ఆవాసాల మధ్య దూరం నేడు తగ్గుతోంది. పలు ప్రాంతాల నుంచి గ్రామంలో పులులు, చిరుతలు,ఎలుగుబంట్లు సంచరిస్తున్న ఘటనలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. అంతే కాదు ఇలాంటి ప్రమాదకరమైన జంతువులు ఇంట్లోకి ప్రవేశించి మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తున్నాయి. దీంతో అటవీ సమీపంలోని ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల్లో భయానక వాతావరణం నెలకొంది. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. వీడియోలో ఒకటి రెండు కాదు.. ఏకంగా చిరుత ఫ్యామిలియే సిబ్బంది క్వార్టర్స్ లోకి ప్రవేశించింది.

ఈ వీడియో X (గతంలో Twitter) హ్యాండిల్ @aniltalwar2లో షేర్‌ చేయబడింది. దానితో పాటు, ఖమీరియా, జబల్‌పూర్‌లోని స్టాఫ్ క్వార్టర్స్‌లో 10 గంటలకు అని క్యాప్షన్ ఉంది. ఈ ఘటన జబల్‌పూర్‌లో చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. వీడియోలో, నాలుగు చిరుతలు గేటు దగ్గరికి వెళుతున్నట్లు కనిపిస్తున్నాయి. అయితే, ఇదంతా కెమెరాతో వీడియోలో రికార్డ్ చేస్తున్న వ్యక్తిని చిరుతపులి చూసింది. దాంతో అది కూడా భయపడింది. ఆ వెంటనే గేటు నుండి దూకి పారిపోయింది. అయితే మిగిలిన మూడు చిరుతలు అక్కడ సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. కాసేపటి తర్వాత మరో రెండు చిరుతలు గేటు నుండి ఒకదాని తర్వాత ఒకటి దూకివెళ్లిపోయాయి.. కానీ ఒక చిరుతపులి గేటు పైన కూర్చొని ఉంది. కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత దూకేసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది.. ఈ వీడియోను ఇప్పటి వరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోపై ప్రజలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎంట్రీకి ముందు అవి ఐ-కార్డ్ చెక్‌ చేయలేదని ఒక వినియోగదారు రాశారు. మరొక వినియోగదారు ఇలా వ్రాశాడు. వావ్! చిరుతపులి కుటుంబం మొత్తం ఇక్కడే ఉంది. మరో వినియోగదారు స్పందిస్తూ..ఈ వీడియో జబల్‌పూర్‌కి చెందినది కాదని, మహారాష్ట్రలోని చంద్రపూర్ సెక్టార్ 6కి చెందినదని పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌