AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Dosh Remedies: జాతకంలో కుజ దోషమా.. నివారణకు కోతులకు వీటిని ఆహారంగా అందించండి..

జాతకంలో కుజుడు స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి వివాహంతో సహా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జాతకంలో మంగళ దోషం కారణంగా వివాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో కుజ దోష నివారణకు జ్యోతిషశాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి. కుజ దోషాన్ని తొలగించడానికి కోతులకు ఆహారం అందించడం అత్యుత్తమ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్కులు చెప్పారు. ఈ రోజు ఆ నివారణ చర్యల గురించి తెలుసుకుందాం.. 

Mangal Dosh Remedies: జాతకంలో కుజ దోషమా.. నివారణకు కోతులకు వీటిని ఆహారంగా అందించండి..
Mangal Dosh Remedies
Surya Kala
|

Updated on: Mar 30, 2024 | 6:53 AM

Share

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ గ్రహాల్లో అంగారకుడు యువ రాజు హోదా కలిగి ఉన్నాడు. కుజుడు శక్తి, శౌర్యం,  ధైర్యసాహసాలకు కారకుడు. ఎవరి జాతకంలోనైనా కుజుడు బలంగా ఉంటే ఆ వ్యక్తి ఎటువంటి కష్టాలు ఎదురైనా బయటపడతాడు. మరోవైపు జాతకంలో కుజుడు స్థానం బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి వివాహంతో సహా అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. జాతకంలో మంగళ దోషం కారణంగా వివాహానికి ఆటంకాలు ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో కుజ దోష నివారణకు జ్యోతిషశాస్త్రంలో అనేక నివారణలు సూచించబడ్డాయి. కుజ దోషాన్ని తొలగించడానికి కోతులకు ఆహారం అందించడం అత్యుత్తమ ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్కులు చెప్పారు. ఈ రోజు ఆ నివారణ చర్యల గురించి తెలుసుకుందాం..

కోతులకు పప్పుని అందించండి: జాతకంలో మంగళ దోషం వల్ల ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే దాని నుండి బయటపడటానికి మంగళవారం రోజున కోతులకు పప్పుని ఆహారంగా అందించండి. ఇది కుజ  దోషాన్ని తొలగిస్తుందని, అదృష్టాన్ని పెంచుతుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. దీంతో పాటు వివాహం జరగడంలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి.

కోతులకు లడ్డూలు తినిపించండి: గురువారం కోతులకు లడ్డూలను ఆహారంగా అందించండి. ఇది జాతకంలో ఉన్న కుజ దోషాన్ని తొలగిస్తుందని నమ్మకం. విష్ణువుకు లడ్డూలు అంటే చాలా ఇష్టం. వీటిని గురువారం కోతులకు ఆహారంగా అందించడం ద్వారా కోరిన కోరిక నెరవేరతాయని విశ్వాసం.

ఇవి కూడా చదవండి

కోతులకు బెల్లాన్ని అందించండి: బుధవారం కోతులకు బెల్లాన్ని తినడానికి ఆహారంగా అందించడం  శుభప్రదంగా భావిస్తారు. అటువంటి పరిస్థితిలో వివాహంలో ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే దాని నుండి బయటపడటానికి బుధవారం కోతులకు బెల్లాన్ని అందించండి. ఇలా చేయడం వల్ల అవివాహితులు మంచి ఫలితాలను పొందవచ్చు. కనుక కోతులకు బుధవారం బెల్లం తినిపించండి.

కోతులకు అరటిపండ్లను ఆహారంగా అందించండి: వివాహంలో ఏవైనా సమస్యలు ఉంటే గురువారం కోతులకు అరటిపండ్లు తినిపించండి. దీంతో పనులన్నీ శుభప్రదంగా పూర్తి అవుతాయి.  మంగళ దోషాలు తొలగిపోతాయని నమ్మకం. అంతే కాకుండా జీవితంలో ఆనందం పెరుగుతుంది. అందుచేత గురువారం కోతులకు అరటిపండ్లు తప్పనిసరిగా తినిపించండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..