Yama Stone in Puri: పూరీ జగన్నాథుని గుడిలో మూడవ మెట్టుని యమ శిల అని అంటారు.. ఈ మెట్టుమీద ఎందుకు అడుగు పెట్టరంటే
పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే వైకుంఠ ధామం. జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలను అందుకుంటున్నారు. జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని, సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆలయానికి దానకి సంబంధించిన కొని రహస్యాలు ఉన్నప్పటికీ.. జగన్నాథ ఆలయానికి సంబంధించిన మూడవ మెట్టుకి సంబంధించిన రహస్యం గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఈ నేపధ్యంలో ఈ ఆలయంలోని రహస్యమైన మెట్టు గురించి తెలుసుకుందాం..
భారతదేశంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటి జగన్నాథ దేవాలయం. ఈ పుణ్యక్షేత్రం దేశంలోని ఒడిసా రాష్ట్రంలోని తీరప్రాంత నగరమైన పూరిలో ఉంది. ఇక్కడ ప్రధాన దైవం జగన్నాథుడు. అంటే లోకానికి ప్రభువైన శ్రీ కృష్ణుడికి అంకితం చేయబడింది. శ్రీకృష్ణుడు కొలువైన ఈ ఆధ్యాత్మిక నగరాన్ని జగన్నాథపురి అంటారు. హిందువుల చేసే చార్ దామ్ యాత్రలో భాగంగా శ్రీ మహా విష్ణువు కొలువైన బద్రీనాథ్, రామేశ్వరం, ద్వారక, పూరి క్షేత్రాలను దర్శించుకుంటారు భక్తులు. అందుకే చార్ దామ్ పవిత్ర స్థలాలలో ఒకటి పురి. ఈ ఆలయం అనేక నమ్మకాలు, రహస్యాలకు ప్రసిద్ధి చెందింది. నేటికీ ఈ ఆలయంలో అనేక అద్భుతాలు ఉన్నాయి. వీటిని సైన్స్ కూడా చేధించలేకపోయింది. ఆధునిక కాలంలో కూడా మిస్టరీ ఆలయంగా ఖ్యాతిగాంచింది. అయితే పూరి జగన్నాథ్ ఆలయం అంటే ప్రసాదం, జెండా వంటివి మాత్రమే చాలా మంది భక్తులకు తెలుసు.. కానీ ఈ ఆలయంలో మెట్ల రహస్యం గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. స్వామివారిని దర్శించుకునే మందు.. లేదా దర్శనం తర్వాత కూడా ఒక మెట్టు మీద అడుగు పెట్టరట.
జగన్నాథ ఆలయం మెట్ల రహస్యం
పురాణాల ప్రకారం జగన్నాథుడు కొలువైన ప్రాంతం భూమిపై స్వర్గం అంటే వైకుంఠ ధామం. జగన్నాథ ఆలయంలో విష్ణువు అవతారం కృష్ణుడు, సోదరుడు బలరాముడు, సోదరి సుభద్రతో కలిసి పూజలను అందుకుంటున్నారు. జగన్నాథుని దర్శనం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని, సర్వపాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం. ప్రతి ఆలయానికి దానకి సంబంధించిన కొని రహస్యాలు ఉన్నప్పటికీ.. జగన్నాథ ఆలయానికి సంబంధించిన మూడవ మెట్టుకి సంబంధించిన రహస్యం గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఈ నేపధ్యంలో ఈ ఆలయంలోని రహస్యమైన మెట్టు గురించి తెలుసుకుందాం..
పురాణాల కథ ప్రకారం..
పురాణం ప్రకారం జగన్నాథుడి దర్శనం చేసుకున్న తర్వాత ప్రజల పాపాలు నశించి విముక్తి పొందడం ప్రారంభించారట. దీంతో యమధర్మ రాజుకి పని లేకుండా పోయిందట. అది చూసిన యమరాజు.. జగన్నాథుని దగ్గరకు వెళ్లి, “ఓ ప్రభూ.. మనుషులు తాము చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు ఈ సులభమైన పరిష్కారం చెప్పారు. కేవలం మిమ్మలని దర్శించుకుని తద్వారా ప్రజలు తమ పాపాల నుంచి సులభంగా విముక్తులవుతున్నారు. దీంతో నరకానికి ఎవరూ రావడం లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి మహా ప్రభో అంటూ జగన్నాథుడికి మోర పెట్టుకున్నాడు. యమ ధర్మరాజు చెప్పిన మాటలు విన్న తర్వాత జగన్నాథుడు ఒక పరిష్కారాన్ని చూపించాడు. గర్భ గుడిలోని ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉన్న మూడవ మెట్టు యమ ధర్మ రాజు స్థానంగా చెప్పారు. ఈ మెట్టుని యమ శిల అని పిలుస్తారు. ఎవరైతే నన్ను దర్శించిన తర్వాత తిరిగి వెళ్తే.. యమ శిల మీద కాలు పెడితే ఆ భక్తుడికి వచ్చిన పుణ్యం కొట్టుకుపోతుంది. తర్వాత యమలోకంలోకి వెళ్ళవలసి వస్తుందని చెప్పాడు కన్నయ్య.
మూడవ మెట్టుపై అడుగు పెట్టడం నిషేధం
జగన్నాథ ఆలయ ప్రధాన ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు.. కొన్ని మెట్లు ఉంటాయి. అలా ప్రవేసించే సమయంలో దిగువ నుండి మూడవ మెట్టుపై యమశిల ఉంటుంది. దర్శనం కోసం ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు భక్తులు తమ పాదాలను మెట్లపై ఉంచాలి. అయితే జగన్నాథుడి దర్శనం తర్వాత తిరిగి వచ్చే సమయంలో.. భక్తులు కింద నుంచి మూడవ మెట్టుపైకి అడుగు పెట్టకుండా ఉండటం మంచిది. ఈ విషయం కొత్తగా వెళ్లే భక్తులకు తెలియడం కోసం ఇతర మెట్ల కంటే భిన్నంగా ఉండేలా.. యమ శిల నలుపు రంగులో ఉంటుంది. జగన్నాథుడి ఆలయంలో మొత్తం 22 మెట్లు ఉన్నాయి. దర్శనం చేసుకున్న తరువాత.. కిందకు వస్తు.. దిగువ నుండి ఉన్న మూడవ మెట్టుపై అడుగు పెట్టె శ్రద్ధ వహించాలి. ఈ మెట్టుపై అడుగు పెట్టకూడదు. ఒకవేళ పొరపాటున ఈ యమశిల మెట్టుమీద అడుగు పెడితే జగన్నాథుడి దర్శనంతో లభించే పుణ్యం నసిస్తుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు