AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keesaragutta: కీసరగుట్టలో మొదలైన మహా శివరాత్రి శోభ… బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే

మహా శివరాత్రి అనగానే కీసరగుట్ట లో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గుర్తుకొస్తుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. మహాశివరాత్రి నాడు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. పూర్వం శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి తిరిగి అయోధ్యకు వెళుతుండగా కీసరగుట్ట కొండపై ఆగాడట.

Keesaragutta: కీసరగుట్టలో మొదలైన మహా శివరాత్రి శోభ... బ్రహ్మోత్సవాల తేదీలు ఇవే
Keesaragutta Temple
Peddaprolu Jyothi
| Edited By: TV9 Telugu|

Updated on: Mar 05, 2024 | 12:27 PM

Share

హిందువులు జరుపుకునే పర్వదినాల్లో మహా శివరాత్రి ముఖ్యమైన పండగ. మహా శివరాత్రి సందర్భంగా ప్రధాన శైవ క్షేత్రాలు అన్నీ ముస్తాబు అవుతున్నాయి. వారం రోజుల నుండే హైదరాబాద్ నగరంలోని  ఆలయాలలో శివ రాత్రి శోభ నెలకొంది. జూబ్లీహిల్స్ లోని TTD వెంకటేశ్వర స్వామి ఆలయం తో సహా కీసర గుట్ట లోని రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు ఆలయ కమిటీ సభ్యులు.

మహా శివరాత్రి అనగానే కీసరగుట్ట లో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం గుర్తుకొస్తుంది. ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. మహాశివరాత్రి నాడు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి రామలింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు. పూర్వం శ్రీరామచంద్రుడు రావణాసురుని సంహరించి తిరిగి అయోధ్యకు వెళుతుండగా కీసరగుట్ట కొండపై ఆగాడట. అక్కడ వాతావరణ పరిస్థితుల వలన చుట్టూ పచ్చని ప్రకృతి ఇవన్నీ చూసిన రాముడు రావణాసురుని సంహరించిన సందర్భంగా అక్కడ శివలింగాన్ని ప్రతిష్టాపించాలని ఆలోచన చేశాడట. దీంతో మహర్షలంతా ఒక సుముహూర్తాన్ని నిర్ణయించారు. అనంతరం శ్రీ రామ చంద్రుడు ఆంజనేయుడికి కాశీలో ఉన్నటువంటి ఓ శివలింగాన్ని తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించాడు.

వెంటనే ఆకాశం మార్గంలో ఆంజనేయుడు కాశీకి పయమయ్యాడు. అయితే విగ్రహ ప్రతిష్టించాల్సిన ముహూర్తం సమయం అవుతున్నా హనుమంతుడు జాడ కనిపించకపోవడం మనసులో శివుడిని స్మరించిన  రాముడికి.. శివుడు ప్రత్యక్షమై ఒక ఆత్మ లింగాన్ని సమర్పించాడట. ఇంతలో 101 లింగాలతో బయలుదేరినటువంటి హనుమంతుడు కీసరగుట్ట ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే రాముడు ప్రతిష్టాపించిన ఆత్మ లింగాన్ని చూసి ఆంజనేయుడు తన పడినటువంటి కష్టం అంతా వృధా అయ్యింది అని బాధలో తాను తెచ్చిన లింగాలను తోకతో విసిరివేయగా కొండమీద అక్కడక్కగా ఆ లింగాలు పడ్డాయట.

ఇవి కూడా చదవండి

శ్రీ రాముడు.. హనుమంతుడినికి వరం ఇస్తూ.. నేను ప్రతిష్టాపించిన ఆత్మలింగం దర్శనం కంటే ముందుగానే నిన్ను నువ్వు తీసుకువచ్చిన 101 లింగాలను దర్శించుకోవాలని .. ఆ తర్వాతనే తాను ప్రతిష్టాపించిన ఆత్మ లింగాన్ని భక్తులు దర్శించుకుంటారని చెప్పాడట.

ఈ విధంగా ఇప్పటికీ మహాశివరాత్రి నాడు లేదా రామలింగేశ్వర స్వామిని దర్శించుకునే ముందు ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆంజనేయుని దర్శించుకుని అక్కడక్కడ కొలువుదీరు ఉన్నటువంటి శివలింగాలను దర్శించుకుంటారు. పూజలు, అభిషేకం చేసిన అనంతరం శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని పూజ చేస్తారు.

ఇది కీసరగుట్ట ఆలయం విశిష్టత. ఇంత విశిష్టత కలిగిన ఈ ఆలయం ఈ ఏడాది మహాశివరాత్రి కి ముస్తాబవుతుంది. ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం మహాశివరాత్రి రోజున కీసరగుట్టలో భారీ భద్రత నడుమ బ్రహ్మోత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. మార్చి 6 నుంచి ప్రారంభమై 11 వరకు నిర్వహించునున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను ఆహ్వానించి ఆమెను సన్మానించారు. ఈసారి మహాశివరాత్రికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఆలయ అధికారులు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..