Temple Tourism: ఏపీలో నవశకానికి నాంది.. చారిత్రాత్మక ఆలయాలను, ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ టూరిజం

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలైన తిరుమల, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, దాక్షారామం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రసిద్ధ ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 టూర్ ప్యాకేజీలను మొదటి విడతగా ప్రారంభించారు. ఈ ప్యాకేజీ యాత్రల్లో భాగంగా దేవాలయ దర్శనంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వారికి శీఘ్ర దర్శనం కుడా ఏర్పాటు చేయనున్నారు.  

Temple Tourism: ఏపీలో నవశకానికి నాంది.. చారిత్రాత్మక ఆలయాలను, ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ టూరిజం
Temple Tourism In Ap
Follow us
P Kranthi Prasanna

| Edited By: Surya Kala

Updated on: Mar 01, 2024 | 12:02 PM

ఆంధ్రప్రదేశ్ లో ఆధ్యాత్మిక పర్యాటకానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు నూతన శకానికి నాంది పలుకుతున్నాయి. ఆధ్యాత్మిక పర్యాటకానికి పెద్ద పీట వేస్తూ భక్తులకు అందుబాటులో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయ దర్శనాలను సులభతరం చేయటంలో భాగంగా దేవదాయ శాఖ, ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ, పిల్ గ్రిమ్ పాత్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల సమన్వయంతో ముందుకు వెళ్లనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా భక్తులకు ఆలయాల దర్శనం సులభతరం చేయటంలో భాగంగా ఒక రోజు, రెండు రోజుల ప్యాకేజీలను రూపొందించి ప్రస్తుతం 18 సర్క్యూట్ లలో అందుబాటులోకి తీసుకుని వచ్చారు.  ఇకపై ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాల దర్శనాలకు సైతం ఇలాగే టెంపుల్ టూరిజం ద్వారా ఏర్పాటు చెయ్యనున్నారు. ఏపీలో నవశకానికి నాంది.. చారిత్రాత్మక ఆలయాలను, ప్రముఖ ప్రాంతాలను కలుపుతూ టెంపుల్ టూరిజం

అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భక్తులకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి తీసుకుని రావటానికి దేవాదాయ శాఖ,టూరిజం కొత్త ప్రయత్నాలు చేస్తుంది. గతంలో సీజనల్ గా ఏర్పాటు చేసిన టూర్ ప్యాకేజీలను నేడు డైలీ టూర్ ప్యాకేజీలుగా మార్పు చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ప్యాకేజీలో భాగంగా భక్తులకు భోజనం, వసతి ఏర్పాట్లు తదితర సేవలను కూడా అందించనున్నారు. రెండు రోజుల టూర్ ప్యాకేజీలో రాత్రి బస, భక్తులు కోరుకున్న విధంగా విశేష పూజలు, అభిషేకాలు, వ్రతములు కూడా భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్యాకేజీ యాత్రల్లో భాగంగా దేవాలయ దర్శనంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వారికి శీఘ్ర దర్శనం కుడా ఏర్పాటు చేయనున్నారు.

రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాలైన తిరుమల, శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, శ్రీకాళహస్తి, అన్నవరం, సింహాచలం, అరసవల్లి, శ్రీకూర్మం, అమరావతి, భీమవరం, దాక్షారామం, సామర్లకోట, పిఠాపురం తదితర ప్రసిద్ధ ఆలయాలను అనుసంధానం చేస్తూ 18 టూర్ ప్యాకేజీలను మొదటి విడతగా ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

అలాగే సాదారణ ప్యాకేజీలతో పాటు కో బ్రాండింగ్ ఏజెన్సీ, యాత్రికులు కోరుకున్న ప్యాకేజీలు అందజేయనున్నారు. రాష్ట్ర భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా తీసుకువచ్చిన ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీలతో క్షేమంగా, ప్రముఖ దేవాలయాలను సులభంగా సందర్శించి దైవదర్శనం చేసుకోవచ్చు.  వృద్ధులు, చిన్నారులను సైతం వెంట తీసుకువెళ్లినా ఎటువంటి ఇబ్బందులు పడకుండా సౌకర్యవంతంగా, ప్రశాంతంగా, అహ్లాదకరంగా యాత్ర ముగించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..