Mahashivratri 2024: శివరాత్రి రోజున ఈ మంతాన్ని పఠించండి.. భయాలు, వ్యాధులు, దోషాలు తొలగిపోతాయి..

ఎవరైనా వ్యాధి లేదా మరేదైనా కారణంతో అకాల మరణం గురించి భయపడుతుంటే వారిని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించమని సలహా ఇస్తారు. మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడు ప్రసన్నుడవుతాడు. అన్ని రకాల భయాలు, వ్యాధులు, దోషాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడని.. ఈ శక్తివంతమైన మంత్రం ప్రభావంతో అన్ని రకాల కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం. 

Mahashivratri 2024: శివరాత్రి రోజున ఈ మంతాన్ని పఠించండి.. భయాలు, వ్యాధులు, దోషాలు తొలగిపోతాయి..
Mahashivratri 2024Image Credit source: unsplash
Follow us
Surya Kala

| Edited By: TV9 Telugu

Updated on: Mar 05, 2024 | 12:27 PM

హిందూ మతంలో మహా మృత్యుంజయ మంత్రం చాలా ప్రత్యేకంగా పరిగణించబడుతుంది. ఇది శివుని చాలా శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది. మహామృత్యుంజయ అంటే “మృత్యువును జయించినవాడు” అని అర్థం.. కనుక ఎవరైనా వ్యాధి లేదా మరేదైనా కారణంతో అకాల మరణం గురించి భయపడుతుంటే వారిని మహామృత్యుంజయ మంత్రాన్ని జపించమని సలహా ఇస్తారు.

మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం ద్వారా శివుడు ప్రసన్నుడవుతాడు. అన్ని రకాల భయాలు, వ్యాధులు, దోషాల నుండి విముక్తిని ప్రసాదిస్తాడని.. ఈ శక్తివంతమైన మంత్రం ప్రభావంతో అన్ని రకాల కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం.

మహామృత్యుంజయ మంత్రం

ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం

ఇవి కూడా చదవండి

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్.

మహామృత్యుంజయ మంత్రం అర్థం

మహామృత్యుంజయ మంత్రం అంటే మూడు కన్నులు కలిగి అందరికి శక్తి ఇచ్చే దేవుడు, సుగంధ భరితుడు అయిన పరమ శివుని మేము పూజింస్తున్నాం. ఆయన దోస పండును తొడిమ నుండి వేరు చేసినట్లుగా అంటే అతి సులభంగా మమల్ని అమరత్వం కోసం మృత్యు బంధనం నుంచి విడిపించు గాక!

మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఆరోగ్యం పొందుతారు:

మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల భక్తుని వయస్సు పెరుగుతుందని , వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారని నమ్ముతారు.

అకాల మరణ భయం తొలగిపోతుంది

పురాణాల శాస్త్రాల ప్రకారం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం వల్ల అకాల మరణ భయం తొలగిపోతుంది. తీవ్రమైన వ్యాధులలో కూడా ఆరోగ్య ప్రయోజనాల కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తారు.

సంపద, శ్రేయస్సు, ఆనందాన్ని పొందేందుకు

ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. సంపదతో పాటు ఆనందం, శాంతి, శ్రేయస్సు , అదృష్టాన్ని ప్రసాదిస్తాడని నమ్ముతారు. నిత్యం మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదని చెబుతారు.

కీర్తి, గౌరవం పొందుతారు

మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల వ్యక్తి కీర్తి పెరుగుతుందని.. సమాజంలో వ్యక్తి గౌరవం పెరుగుతుందని నమ్ముతారు.

సంతానం పొందడం కోసం

సంతానం పొందాలనుకునే వారు కూడా మహామృత్యుంజయ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం మంచిది. ఇలా చేయడం వల్ల శివుడు సంతుష్టుడై సంతానాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు