Srisailam: నేటి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ.

శ్రీ శైలంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11 రోజులపాటు భక్తులు వస్తారని ఈవో పెద్దిరాజు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుండి 11 వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు. జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చి 5న సాయంత్రం వరకు ఉచిత స్పర్శ  దర్శనం కల్పిస్తున్నామన్నారు.

Srisailam: నేటి నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఆర్జిత సేవలు రద్దు.. భారీగా భక్తుల రద్దీ.
Srisailam Temple
Follow us
J Y Nagi Reddy

| Edited By: TV9 Telugu

Updated on: Mar 05, 2024 | 12:26 PM

నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీశైలం ఆలయం రంగు రంగుల విద్యుత్ దీపాలతో పెయింటింగ్ లతో ఆలయం ముస్తాబవుతుంది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భక్తులు మన రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం లక్షలాదిగా పాదయాత్ర చేస్తూ నల్లమల కొండలు దాటుకుని శ్రీశైలం తరలి వస్తారు. శ్రీశైలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భక్తుల సౌకర్యార్ధం దేవస్థానం అధికారులు విసృత ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీస్వామివారి దర్శనానికి భక్తులు ఐదు రోజుల ముందు నుంచే పాదయాత్రతో శ్రీశైలం తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం చేపట్టవలసిన పనులపై ఇప్పటికే  ఆలయాధికారులు సిబ్బంది సమీక్ష సమావేశాలు నిర్వహించారు

శ్రీ శైలంలో నేటి నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండడంతో ఈ సంవత్సరం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సుమారు 10 లక్షల పైన 11 రోజులపాటు భక్తులు వస్తారని ఈవో పెద్దిరాజు అంచనా వేశారు. అందులో భాగంగా నేటి నుండి 11 వరకు ఆర్జిత సేవలు నిలుపుదల చేసి భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి అనుమతిస్తున్నట్లు ఈవో పెద్దిరాజు తెలిపారు .

జ్యోతిర్ముడి కలిగిన శివస్వాములకు మాత్రమే రేపటి నుండి మార్చి 5న సాయంత్రం వరకు ఉచిత స్పర్శ  దర్శనం కల్పిస్తున్నామని అలానే మాలధారణ కలిగిన శివస్వాములకు చంద్రావతీ కల్యాణ మండపం ద్వారా ప్రత్యేక దర్శన క్యూలైన్ ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా క్షేత్ర పరిధిలో 11 చోట్ల 38 ఎకరాలలో వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

శివరాత్రికి విచ్చేసే భక్తులకు 35 లక్షల లడ్డూలు అందుబాటులో ఉంచనున్నారు. క్షేత్రంలో పలుచోట్ల లడ్డు కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వికలాంగులకు, వృద్ధులకు,   చంటి బిడ్డ తల్లులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దర్శనానికి అనుమతి కల్పిస్తామని తెలిపారు.

పాతాళగంగలో నీరు తగ్గడంతో గంగ మెట్ల వద్ద అలానే రాజుల సత్రం వద్ద భక్తుల స్నానానికి షవర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆలయానికి వసతి గృహాలకు భక్తులు వెళ్ళడానికి ఇబ్బందులు లేకుండా 10 ఉచిత బస్సుల సౌకర్యం చేస్తున్నామన్నారు.

ఈసారి మహాశివరాత్రికి తెలంగాణ, కర్ణాటక, ఆంధ్ర నుంచి సుమారు 1500 బస్సులు కూడా క్షేత్రానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. జిల్లా అధికారులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామని భద్రతాపరంగా వైద్య దర్శనం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు.

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వివరాలు

01 న యాగశాల ప్రవేశంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. సాయంత్రం ధ్వజారోహణ 02 వ తేదీన భృంగివాహన సేవ 03 వ తేదీన హంసవాహనసేవ. 04 వతేదీన మయూరవాహనసేవ, 05 వతేదీన రావణవాహన సేవ 06 వతేదీన పుష్పపల్లకీ సేవ 07 వతేదీన గజవాహనసేవ 08 వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రభోత్సవం నందివాహనసేవ, రాత్రి 10 గంటలకు లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం పాగాలంకరణ, శ్రీ స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం 09 వతేదీన స్వామి అమ్మవారికి రథోత్సవం రాత్రి తెప్పోత్సవం 10 వ తేదీన యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ 11 వ తేదీన అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం పట్టువస్త్రాల సమర్పణతో బ్రహ్మోత్సవాలు ముగింపు

బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల నుంచి శ్రీ స్వామి అమ్మవారి పట్టువస్త్రాలను సమర్పించనున్నారు.

నేడు శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం  తరపున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాల సమర్పణ

02 వతేదీ ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తరుపున పట్టు వస్త్రాలు

03 వతేదీ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం

04 వతేదీ ఉదయం శ్రీ వర సిద్ధివినాయక స్వామి వార్ల దేవస్థానం కాణిపాకం,

04 వతేదీ సాయంకాలం తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సంప్రదాయం

05 వతేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం తరపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన