Mangal Gochar: ఈ నెల 15న ఏర్పడనున్న శని, కుజల కలయిక.. ఈ 3 రాశులకు చెందివారికి రాజయోగం..

ఈ నేపధ్యంలో కుజుడు ఈ నెల 15 వ తేదీన మకర రాశి నుంచి కుంభ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే శనీశ్వరుడు కుంభరాశిలో ఉండడంతో మార్చి 15 న శని కుజుడు కలయిక ఏర్పడనుంది. ఈ అరుదైన గ్రహాల కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వారికి శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా 3 రాశులకు చెందిన వారికీ రాజయోగం పట్టనుంది అని జ్యోతిష్యులు చెప్పారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Mangal Gochar: ఈ నెల 15న ఏర్పడనున్న శని, కుజల కలయిక.. ఈ 3 రాశులకు చెందివారికి రాజయోగం..
Mangal Gochar
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2024 | 7:05 AM

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవ గ్రహాల్లో అంగారకుడు ఉగ్ర స్వభావం కలవాడు. ఈ గ్రహాన్ని కుజుడు అని కూడా అంటారు. జాతకంలో కుజుడు దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు. నవగ్రహాలకు సర్వ సైన్యాధ్యక్షుడుగా వ్యవహరిస్తాడు. అంతేకాదు దైర్యవంతుడిగా ఉంటాడు. ఈ నేపధ్యంలో కుజుడు ఈ నెల 15 వ తేదీన మకర రాశి నుంచి కుంభ రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇప్పటికే శనీశ్వరుడు కుంభరాశిలో ఉండడంతో మార్చి 15 న శని కుజుడు కలయిక ఏర్పడనుంది. ఈ అరుదైన గ్రహాల కలయిక వలన కొన్ని రాశులకు చెందిన వారికి శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా 3 రాశులకు చెందిన వారికీ రాజయోగం పట్టనుంది అని జ్యోతిష్యులు చెప్పారు. ఆ రాశులు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

మేష రాశి: ఈ రాశికి చెందిన వారికి శని, కుజుల కలయిక వలన అనుకోని విధంగా లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఉద్యోగులకు శుభ సమయం. భార్యాభర్తల మధ్య ఉన్న వివాదాలు తొలగి సంతోషంగా జీవిస్తారు. జీవిత భాగస్వామి మద్దతుతో కెరీర్ లో ముందుకు సాగుతారు. ఆర్ధికంగా సుభాఫలితాలను అందుకుంటారు.

సింహరాశి: ఈ రాశికి చెందిన వారికి కుజ సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్దికంగా లాభాలను అందుకుంటారు. ఎప్పటి నుంచో పెండింగ్ పడుతున్న పనులలో కదలిక ఏర్పడి మందుకు సాగుతారు. కెరీర్ పరంగా ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు చేస్తారు. అంతేకాదు డబ్బుల విషయంలో పలు రకాలుగా సంపాదించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి బయటపడతారు.

ఇవి కూడా చదవండి

కుంభ రాశి: ఈ రాశిలో ఇప్పటికే శనీశ్వరుడు ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో కుజుడు కూడా ఈ రాశిలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీంతో శని, కుజుల కలయిక ఈ రాశికి చెందిన వారికి అనుకోని అదృష్టాన్ని తీసుకుని వస్తుంది. ఆర్ధికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో లాభాలను అందుకుంటారు. షేర్ మార్కెట్ రంగంలో ఉన్న సింహ రాశి వ్యక్తులు ఊహించని లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఈ రాశికి చెందిన వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు