Horoscope Today: ఆ రాశి వారికి ఒకట్రెండు శుభవార్తలు అందుతాయి.. 12 రాశుల వారికి శుక్రవారం రాశిఫలాలు
దిన ఫలాలు (మార్చి 1, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిదానంగా ముందుకు వెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
దిన ఫలాలు (మార్చి 1, 2024): మేష రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది. వృషభ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిదానంగా ముందుకు వెడతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. విశ్రాంతి కరువవుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఉత్సాహం కలిగిస్తాయి. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడతారు. ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేయడంలో కొద్దిపాటి ఇబ్బందులుంటాయి. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. శుభకార్యంలో మిత్రులకు సహాయం చేస్తారు. బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కివస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి శుభవార్త అందుతుంది.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): వృత్తి, ఉద్యోగాలలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కానీ, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. బంధువులతో మాట పట్టింపులుంటాయి. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): వృత్తి, ఉద్యోగాలు ప్రశాంతంగా సాగిపోతాయి. వ్యాపారాలు నిదానంగా ముందుకు వెడతాయి. నిరు ద్యోగులకు చిన్న ప్రయత్నంతో మంచి ఉద్యోగం లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. చేపట్టిన పనులను గట్టి పట్టుదలతో పూర్తి చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక శుభ కార్యం మీద బాగా ఖర్చు చేస్తారు. పిల్లలు చదువుల్లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగులు శ్రమకు తగిన గుర్తింపు పొందుతారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. అన్ని రంగాలవారు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలను విస్తరించే అవకాశం ఉంది. చాలా మార్గాల నుంచి ఆదాయం పెరుగుతుంది. ఆస్తి వివాదానికి సంబంధించి తోబుట్టువు లతో రాజీమార్గం అనుసరిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. ప్రయా ణాల్లో మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి వాగ్దానాలూ చేయవద్దు.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): రోజంతా సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆక ట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తాయి. చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి లోటుండదు. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): సమయం అన్ని విధాలు గానూ అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగు తారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో మరో మెట్టు పైకెక్కే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాబాలపరంగా కొత్త పుంతలు తొక్కుతాయి. అన్ని రంగాలవారికి అనుకూల వాతావరణం ఉంది. ఇంటా బయటా మీ మాటకు, చేతకు విలువ పెరుగు తుంది. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభవార్తలు అందుకుంటారు. ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు సానుకూలపడతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంతో దైవ కార్యాల్లో పాల్గొంటారు.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): ఉద్యోగంలో మీ శక్తి సామర్థ్యాలు వెలుగులోకి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలను అధిగ మిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు బాగా ఉపయోగ పడతాయి. సోదరులతో విభేదాలు, వివాదాలు పరిష్కారం అవుతాయి. విదేశీ ప్రయాణానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలకు తగిన స్పందన లభి స్తుంది. ధన వ్యవహారాల్లో ఎవరికీ మాట ఇవ్వడం మంచిది కాదు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారం చేపట్టే అవకాశం ఉంది.వృత్తి, వ్యాపా రాలు అంచనాలకు మించి రాణిస్తాయి. ఆర్థిక వాతావరణం అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు కూడా వసూలవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. దైవ చింతన పెరుగు తుంది. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి సమయస్ఫూర్తితో బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. సమాజంలో గౌరవ మర్యా దలు పెరుగుతాయి. ఒకటి రెండు మొండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగంలో ప్రధాన లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఇంటా బయటా శ్రమ అధికంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. వృత్తి, వ్యాపా రాల్లో పురోగతి ఉంటుంది. తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల విషయంలో శుభ వార్తలు అందుతాయి. ప్రత్యర్థులు, పోటీదార్ల ఒత్తిడి తగ్గుతుంది. నిరు ద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగంలో పని తీరు మరింత మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో వాదోపవాదాలకు దిగవద్దు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థికంగా పురోగతి చెందుతారు. కొద్ది శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. సర్వత్రా మీ మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో మీకు అనుకూలంగానే పరిష్కారాలు చోటు చేసుకుంటాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు.