Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి..12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..

దిన ఫలాలు (మార్చి 2, 2024): మేష రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మీపై అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి వారికి శుభవార్తలు అందుతాయి..12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు..
Horoscope Today 02nd March 2024
Follow us
Janardhan Veluru

|

Updated on: Mar 02, 2024 | 5:01 AM

దిన ఫలాలు (మార్చి 2, 2024): మేష రాశి వారికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. వృషభ రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. మీపై అధికారులకు నమ్మకం పెరుగుతుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించడం మంచిది. ప్రయత్న లోపం లేకుండా చూసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలన్నీ పూర్తవుతాయి. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉంటుంది. ఉద్యో గంలో మంచి హోదా లభిస్తుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. మానసిక ఒత్తిడి చాలావరకు తగ్గుతుంది. విద్యార్థులు విజయాలు సాధిస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం మంచిది. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందు తాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. అనవసర ఖర్చుల్ని తగ్గించు కోవలసిన అవసరం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. కోపతాపాలను తగ్గించుకోవడం మంచిది. ఇతరుల విమర్శలను పట్టించుకోవద్దు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారులతో సామరస్యం పెరుగుతుంది. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కొద్దిగా ఆలస్యం అయినప్పటికీ ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన లాభం ఉంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. నిరుద్యోగులు ఆశించిన సమాచారం అందుకుంటారు.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు, చేర్పులు తలపెడ తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సానుకూలపడ తాయి. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. కుటుంబ నమస్యలు పరిష్కారం అవుతాయి. చిన్న నాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విద్యా ర్థులు కొద్ది ప్రయత్నంతో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో ఊహించని ప్రోత్సాహకాలు అందుకుంటారు. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. నిరుద్యోగులే కాక, ఉద్యోగులు కూడా విదేశాల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసిక ప్రశాం తత లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీ సలహాలు, సూచనల ద్వారా లబ్ధి పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. విద్యార్థులకు శ్రమ తప్పక పోవచ్చు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలు గౌరవప్రదంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు పెరుగు తాయి. విదేశాలలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు సానుకూల సమా చారం అందుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకపోవడం మంచిది. కుటుంబ సభ్యుల మీద భారీగా ఖర్చు చేస్తారు. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది. మీ మాట చెలామణీ అవుతుంది. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు లాభ సాటిగా పురోగమిస్తాయి. ఇంటా బయటా గౌరవ మర్యాదలుంటాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడం మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు న్నాయి. విద్యార్థులు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. ప్రేమల్లో ముందడుగు వేస్తారు.

వృ‌శ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అతిగా బరువు బాధ్యతలు మోయాల్సి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి ఆశించినంతగా సంపాదన పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ముఖ్యమైన పనుల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. పరిచయస్థులలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసు కోవడం మంచిది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆశించిన శుభవార్తలు వింటారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. అనుకోకుండా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగు తుంది. వృత్తి, వ్యాపారాలకు సంబంధించిన వ్యవహారాల్లో సొంత ఆలోచనలు మంచివి. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రత్యేక బాధ్య తలు నిర్వర్తించాల్సి వస్తుంది. విద్యార్థులు చదువుల్లోనూ, పోటీ పరీక్షల్లోనూ విజయాలు సాధిస్తారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రద్ధ పెంచడం జరుగుతుంది. కొత్త ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. విద్యార్థులు ఎక్కు వగా శ్రమపడాల్సి ఉంటుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్త వుతాయి. ప్రముఖులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొం టారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ కార్యాలకు హాజరవు తారు. విదేశాల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపో తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం సాధారణంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కీలకమైన మార్పులు చేపడ తారు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చవద్దు. ఆస్తి వ్యవహారాలు చక్కబడతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వృథా ఖర్చులు బాగా తగ్గుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను స్నేహి తుల సహాయంతో పూర్తి చేస్తారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అనుకోకుండా ఆశించిన శుభవార్తలు వింటారు.

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!