Kanipakam: కాణిపాకం గణపయ్యకు ఇద్దరు దాతల భారీ విరాళం.. రూ.5 కోట్ల విలువైన 20 బంగారు బిస్కెట్ల కానుక
సత్య ప్రమాణ దైవం విఘ్నాలకధిపతి వరసిద్ధి వినాయకస్వామికి ఆరు కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చారు ఇద్దరు భక్తులు. ఎన్నారైలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ 20 బంగారు బిస్కెట్లను స్వామివారికి కానుక అందజేశారు. ఈ కానుకల విలువ 5 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. భక్తులు ఇచ్చిన 6 కేజీలు బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఆలయ అధికారులు ఉపయోగించునున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం. ఈ క్షేత్రంలో బావిలో వెలసిన వినాయకుడు భక్తులకు వరాలను ఇస్తూ వరసిద్ధి వినాయకస్వామిగా పూజలను అందుకుంటున్నాడు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ వినాయకుడు విగ్రహం పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం. సత్యానికి మారుపేరుగా నిలిచిన వరసిద్ధి వినాయకస్వామిని నిత్యం భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు.
తాజాగా సత్య ప్రమాణ దైవం విఘ్నాలకధిపతి వరసిద్ధి వినాయకస్వామికి ఆరు కిలోల బంగారు బిస్కెట్లు కానుకగా ఇచ్చారు ఇద్దరు భక్తులు. ఎన్నారైలు ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్ 20 బంగారు బిస్కెట్లను స్వామివారికి కానుక అందజేశారు. ఈ కానుకల విలువ 5 కోట్ల ఉంటుందని తెలుస్తోంది. భక్తులు ఇచ్చిన 6 కేజీలు బంగారు బిస్కెట్లను స్వామివారి అంతరాలయం, బంగారు వాకిలి నిర్మాణానికి ఆలయ అధికారులు ఉపయోగించునున్నారు.
ఇప్పటికే దాతలు ఎన్నారై ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్.. కాణిపాకం ఆలయం పునర్నిర్మాణం కూడా చేపట్టారు. ఐకా రవి, గుత్తికొండ శ్రీనివాస్‌కు ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం ఏర్పాట్లు చేశారు ఆలయ ఈవో వెంకటేష్, చైర్మన్ మోహన్‌రెడ్డి. దర్శనం తర్వాత ఇరువురికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేసి ఆశీర్వదించారు వేద పండితులు. స్వామివారికి భారీ విరాళం అందజేయడం పట్ల ఆలయ అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అటు స్వామివారి ఆలయ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకరిస్తామని చెప్పారు ఇరువురు దాతలు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..