Kerala Man: ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. షాక్ తిన్న వైద్య బృందం..

55 ఏళ్ల వ్యక్తికీ శ్వాస సమస్య తీసుకోవడంతో తీవ్ర సమస్య ఏర్పడడంతో.. వెంటనే కొచ్చిలోని అమృత ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్యుల బృందం ఆ రోగి ఊపిరితిత్తులను పరిశీలించగా.. లోపలి భాగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో నాలుగు సెంటీమీటర్ల పొడవున్న బొద్దింక ఇరుక్కుపోయి ఉంది. అందుకనే ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని వైద్యుల బృందం గుర్తించి అతనికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది.

Kerala Man: ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి వెళ్లిన రోగి.. షాక్ తిన్న వైద్య బృందం..
Cockroach In Lungs
Follow us
Surya Kala

|

Updated on: Mar 01, 2024 | 8:38 AM

ఇప్పుడు దేశ, విదేశాల్లో ఎక్కడ ఏ వింతలు విశేషాలు వంటి సంఘటన జరిగినా వెంటనే తెలుస్తున్నాయి. తాజాగా ఓ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని ఆస్పత్రికి వెళ్ళగా., అతడిని పరీక్షించిన వైద్యులు షాక్ తిన్నారు. ఎందుకంటే ఆ వ్యక్తీ ఊపిరితిత్తులలో ఉన్న బొద్దింకను గుర్తించారు ఆ వైద్య బృందం. అనంతరం ఆపరేషన్ చేసి ఆ బొద్దింకను తొలగించారు. ఈ దారుణ ఘటన కేరళలోని కొచ్చిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం రోగి పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే..

ఆసియానెట్ న్యూస్ ప్రకారం.. 55 ఏళ్ల వ్యక్తికీ శ్వాస సమస్య తీసుకోవడంతో తీవ్ర సమస్య ఏర్పడడంతో.. వెంటనే కొచ్చిలోని అమృత ఆసుపత్రికి చేరుకున్నాడు. వైద్యుల బృందం ఆ రోగి ఊపిరితిత్తులను పరిశీలించగా.. లోపలి భాగాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఊపిరితిత్తుల్లో నాలుగు సెంటీమీటర్ల పొడవున్న బొద్దింక ఇరుక్కుపోయి ఉంది. అందుకనే ఆ వ్యక్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడని వైద్యుల బృందం గుర్తించి అతనికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసింది.

నివేదిక ప్రకారం ఫిబ్రవరి 22న డాక్టర్ టింకు జోసెఫ్ నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. లంగ్స్ లోపల ఉన్న బొద్దింక కుళ్లిపోయింది. ఈ కారణంగా బహుశా రోగి శ్వాస తీసుకోవడంలో సమస్యలు పెరిగి ఉంటాయని భావించారు. రోగి ఊపిరితిత్తుల నుంచి బొద్దింకను విజయవంతంగా తొలగించేందుకు వైద్యులకు ఎనిమిది గంటల సమయం పట్టింది. రోగికి అప్పటికే శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఉన్నాయని.. అందువల్ల శస్త్రచికిత్స సంక్లిష్టంగా మారిందని డాక్టర్ జోసెఫ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

అయితే ఇంత పెద్ద బొద్దింక ఆ వ్యక్తి ఊపిరితిత్తుల్లోకి ఎలా చేరిందో అని ఆశ్చర్యపోతే అందుకు కూడా సమాధానం దొరికింది. నివేదిక ప్రకారం గతంలో చికిత్స కోసం రోగి మెడలో ఏర్పాటు చేసిన ట్యూబ్ ద్వారా బొద్దింక ఊపిరితిత్తులకు చేరుకుంది. ప్రస్తుతం రోగి పూర్తిగా క్షేమంగా ఉన్నాడని.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని డాక్టర్ జోసెఫ్ తెలిపారు.

ఇటీవల ఢిల్లీలోని వైద్యుల బృందం 26 ఏళ్ల యువకుడి పేగు నుండి 39 నాణేలు, 37 ఉంగరాలను తొలగించారు. పదేపదే వాంతులు, కడుపునొప్పి రావడంతో ఆ యువకుడు ఆస్పత్రికి చేరుకున్నాడు. ఢిల్లీలోని శ్రీ గంగారామ్ ఆసుపత్రిలో ఈ శస్త్రచికిత్స జరిగింది. నివేదికల ప్రకారం బాడీ బిల్డింగ్ కోసం శరీరంలో జింక్ పెంచాలనే ఉద్దేశ్యంతో యువకుడు ఇలా చేసాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్