National Anthem: సమరాగ్ని యాత్ర ముగింపు సభలో అనుహ్య ఘటన.. జాతీయ గీతాన్ని అవమానించిన కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ సమరాగ్ని యాత్ర ముగింపు సమావేశంజాతీయ గీతం ఆలపించేందుకు పాలోడు రవి మైక్ ముందుకొచ్చి ప్రజలను లేచి నిలబడాలని కోరారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని పాడడం మొదలుపెట్టాడు. ‘‘జనగణ మంగళ దాయే..’’ అంటూ తప్పుగా మొదలు పెట్టాడు. పక్కనే నిలబడిన ఉన్న ఎమ్మెల్యే టి.సిద్ధిక్ వెంటనే స్పందించి రవిని పక్కకు జరిపి మైక్ లాగేసుకున్నారు.

National Anthem: సమరాగ్ని యాత్ర ముగింపు సభలో అనుహ్య ఘటన.. జాతీయ గీతాన్ని అవమానించిన కాంగ్రెస్ నేత
Palode Ravi Sang The National Anthem
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 01, 2024 | 7:29 AM

కేరళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరాగ్ని యాత్ర ముగింపు సమావేశంలో జాతీయ గీతానికి అవమానం జరిగింది. తిరువనంతపురం డీసీసీ అధ్యక్షుడు పాలోడే రవి జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారు. ముగింపు కార్యక్రమం అనంతరం జాతీయ గీతం ఆలపించేందుకు వచ్చిన పాలోడు రవికి మొదటి లైన్ తప్పింది. వెంటనే పొరపాటున గుర్తించిన ఎమ్మెల్యే టి.సిద్ధిక్‌ మైక్‌ లాక్కొని ‘సీడీ అక్కడ పెడతాను’ అంటూ మైక్‌ నుంచి రవిని పంచించేశారు. చివరగా, ఒక మహిళా నాయకురాలు వచ్చి జాతీయ గీతాన్ని అలపించి సమావేశాన్ని ముగించారు.

కాంగ్రెస్ సమరాగ్ని యాత్ర ముగింపు సమావేశంజాతీయ గీతం ఆలపించేందుకు పాలోడు రవి మైక్ ముందుకొచ్చి ప్రజలను లేచి నిలబడాలని కోరారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని పాడడం మొదలుపెట్టాడు. ‘‘జనగణ మంగళ దాయే..’’ అంటూ తప్పుగా మొదలు పెట్టాడు. పక్కనే నిలబడిన ఉన్న ఎమ్మెల్యే టి.సిద్ధిక్ వెంటనే స్పందించి రవిని పక్కకు జరిపి మైక్ లాగేసుకున్నారు. అయితే రవి జాతీయ గీతాన్ని అలపించే సమయంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి సచిన్ పైలట్, ఇతర ముఖ్య నేతలు వేదికపై ఉన్నారు. మీరు వినండి..

అయితే ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించిన పాలోడు రవిపై ఎంపీ సురేష్ ధ్వజమెత్తారు. జాతీయ గీతం ఎలా పాడాలో కూడా తెలియదని కాంగ్రెస్ నేతలను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా రావడం మొదలయ్యాయి. చివరి రోజు సమరాగ్ని వేదికపై కె. సుధాకరన్‌కు బదులుగా బీజేపీ అధ్యక్షుడు కె. సురేంద్రన్‌కు అంటూ ఆంటోని ఎంపి స్వాగతం పలికారు.

ఇదిలావుంటే సమరాగ్ని యాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు వచ్చిన కార్యకర్తలు ముందుగానే వెనుదిరగడంపై కేపీసీసీ అధ్యక్షుడు కె.సుధాకరన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడు మాట్లాడబోయే సమయానికి సభా వేదిక ఖాళీగా ఉందని సుధాకరన్ మండిపడ్డారు. కార్యకర్తల సమీకరణలో పార్టీ నేతల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మొత్తం స్పీచ్ వినకూడదనుకుంటే ఎందుకు వచ్చావు, లక్షలు వెచ్చించి కార్యక్రమం నిర్వహించడం ఎందుకు. సభలు ఆర్భాటంగా నిర్వహించి ముందుగా కుర్చీలు ఖాళీ చేస్తారు’ అని సుధాకరన్ ఫైర్ అయ్యారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…