SemiConductor: దేశంలో ఇక ఎలక్ట్రానిక్స్ విప్లవం.. ఒకేసారి మూడు యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. పూర్తి వివరాలు

దేశంలోని మొదటి కమర్షియల్‌ సెమీ కండక్టర్‌ ఫ్యాబ్‌ను టాటా, తైవాన్‌కు చెందిన పవర్‌చిప్‌లు ఏర్పాటు చేయనున్నాయని, ఇది గుజరాత్‌లోని ధోలోరాలో ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్‌ చెప్పారు. తైవాన్‌లో ఆరు సెమీ కండక్టర్‌ ఫౌండ్రీలు కలిగి ఉన్న పవర్‌ చిప్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్ప్‌(పీఎంఎంసీ), టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్ సాంకేతిక భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతున్నట్లు చెప్పారు.

SemiConductor: దేశంలో ఇక ఎలక్ట్రానిక్స్ విప్లవం.. ఒకేసారి మూడు యూనిట్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం.. పూర్తి వివరాలు
Semiconductor
Follow us
Madhu

|

Updated on: Mar 01, 2024 | 6:53 AM

ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రానిక్స్‌ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. దీంతో మన దేశంలో ఎలక్ట్రానిక్స్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్నిస్తోంది. పైగా దేశంలోని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రానిక్స్‌రంగంలోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ముఖ్యంగా టాటా గ్రూప్‌ ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఈ విషయాన్ని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్ చంద్రశేఖరన్ కూడా వెల్లడించారు. ఈ క్రమంలో గురువారం కేంద్రం నిర్వహించిన కేబినెట్‌ సమావేశంలో ఎలక్ట్రానిక్స్‌ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు మూడు సెమీకండక్టర్‌ యూనిట్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. మొత్తం యూనిట్లలో రెండు టాటా సన్స్‌ గ్రూప్‌నకు కేటాయించినట్లు చెప్పారు. 2021 డిసెంబర్‌లో కేంద్రం రూ. 76,000 కోట్లతో చిప్‌ల తయారీకి పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదించింది. ఈ మూడు ప్లాంట్ల కోసం రూ. 1.27లక్షల కోట్ల పెట్టుబడి అవసరం అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

గుజరాత్‌లో తొలి ప్లాంట్‌..

దేశంలోని మొదటి కమర్షియల్‌ సెమీ కండక్టర్‌ ఫ్యాబ్‌ను టాటా, తైవాన్‌కు చెందిన పవర్‌చిప్‌లు ఏర్పాటు చేయనున్నాయని, ఇది గుజరాత్‌లోని ధోలోరాలో ఏర్పాటవుతుందని కేంద్ర మంత్రి వైష్ణవ్‌ చెప్పారు. తైవాన్‌లో ఆరు సెమీ కండక్టర్‌ ఫౌండ్రీలు కలిగి ఉన్న పవర్‌ చిప్‌ సెమీకండక్టర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్ప్‌(పీఎంఎంసీ), టాటా ఎలక్ట్రానిక్స్ పవర్ లిమిటెడ్ సాంకేతిక భాగస్వామ్యంతో ఈ ప్లాంట్‌ ఏర్పాటవుతున్నట్లు చెప్పారు. ఇరు సంస్థలు సంయుక్తంగా రూ. 91,000కోట్ల పెట్టుబడులు పెడతాయని ఆయన వివరించారు. ఈ చిప్ ఫ్యాబ్ పథకం ద్వారా ప్రత్యక్షంగా 26,000 మందికి ఉపాధి లభిస్తుందని, దాదాపు లక్ష మందికి పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని వైష్ణవ్ తెలిపారు. నెలకు 50,000 వేఫర్లను తయారు చేసే కెపాసిటీని ఈ ప్లాంట్ కలిగి ఉండనుందని ఆయన చెప్పారు.. 28 న్యానో మీటర్ల హైకెపాసిటీ కంప్యూటర్ చిప్స్ ఇందులో తయారవుతాయి.

అసోంలో రెండో ప్లాంట్‌..

టాటా సెమీ కండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ ప్రైవేట్‌ లిమిమెట్‌ మరో ప్లాంట్‌ అసోం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని కోసం రూ. 27,000 కోట్లను వెచ్చిస్తోంది.ఈ ప్లాంట్లో ఆటోమోటివ్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్‌, టెలికాం, స్మార్ట్‌ ఫోన్లలో వినియోగించే చిప్‌లను ఉత్పతి చేస్తారు. రోజుకు 48 మిలియన్ల సెమీకండక్టర్లను తయారు చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మూడో యూనిట్‌ గుజరాత్‌లో..

కేంద్రం ఆమోదించిన విధంగా మూడో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏటీఎంపీ గుజరాత్‌ సనంద్‌లో ఏర్పాటు చేయనున్నారు. సీజీ పవర్‌, జపాన్‌లోని రెనెసాస్‌ ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌, థాయ్‌ల్యాండ్‌లోని స్టార్స్‌ మైక్రో ఎలక్ట్రానిక్స్‌ సంయుక్తంగా నెలకొల్పుతున్నారు. ఇందుకోసం వారు రూ. 76,00 కోట్లను వెచ్చిస్తున్నారు. ఈ ప్లాంట్లో రోజుకు 15 మిలియన్ల చిప్స్‌ ఉత్పత్తి అవుతాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!