BYD Floating Car: రోడ్డుపైనే కాదు.. నీటిపైనా దూసుకెళ్తుంది.. చైనా కంపెనీ అద్భుతం..
చైనాకు చెందిన బీవైడీ బ్రాండ్ ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌ని షేక్ చేసే ఉత్పత్తిని లాంచ్ చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఓ లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. జెనీవాలో జరుగుతున్న కార్‌షో దీనిని ప్రదర్శంచింది. ఎస్‌యూవీ వేరియంట్‌గా లాంచ్ అయిన ఈ కారు పూరు యాంగ్‌వాంగ్ యూ8. ఇదొక ప్లగ్ ఇన్ హైబ్రీడ్ మోడల్. దీనిలో ప్రత్యేకత ఏంటో తెలుసా?

ప్రపంచం అడ్వాన్స్ అవుతోంది. శాస్త్ర సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. అన్ని రంగాల్లో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ మోడల్స్ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఇదే క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలు కూడా కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నాయి. మన దేశంలో కాస్త నెమ్మదిగా ఉన్న ఎలక్ట్రిక్ కార్ల బిజినెస్ చైనా, అమెరికా వంటి దేశాల్లో చాలా వేగంగా విస్తరిస్తోంది. టెస్లా, బీవైడీ వంటి బ్రాండ్లు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. చైనాకు చెందిన బీవైడీ బ్రాండ్ ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్‌ని షేక్ చేసే ఉత్పత్తిని లాంచ్ చేసింది. అత్యాధునిక సాంకేతికతతో కూడిన ఓ లగ్జరీ ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. జెనీవాలో జరుగుతున్న కార్‌షో దీనిని ప్రదర్శంచింది. ఎస్‌యూవీ వేరియంట్‌గా లాంచ్ అయిన ఈ కారు పూరు యాంగ్‌వాంగ్ యూ8. ఇదొక ప్లగ్ ఇన్ హైబ్రీడ్ మోడల్. దీనిలో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇది రోడ్లపై ప్రయాణించడంతో పాటు నీటిపైనా ఎంచక్కా తేలుతూ పడవలా వెళ్లగలుగుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
యూరోపియన్ మార్కెట్‌పై ఫోకస్..
చైనాకు చెందిన బీవైడీ సంస్థ యూరోపియన్ మార్కెట్‌పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ ప్లగ్ ఇన్ హైబ్రీడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కారును జెనీవా కార్ షోలో ప్రదర్శించింది. ప్రస్తుతం చైనాలో ఇది అందుబాటులో ఉన్నప్పటికీ దీనిని యూరోపియన్ మార్కెట్లో సత్తా చాటాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎస్‌యూవీలో 1200హెచ్‌పీ సామర్థ్యంతో నాలుగుమోటార్లు ఉంటాయి. 2.0 టర్బో చార్జెడ్ 4 సిలెండర్ ఇంజిన్‌లు ఉంటాయి. దీనిలో బ్యాటరీని ఒక్కసారి చార్జ్ చేస్తే 620 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని బీవైడీ సంస్థ ప్రకటించింది. దీని ధరపై కంపెనీ ఇంకా ఎటువంటి ప్రకటనా చేయనప్పటికీ.. 1,50,000డాలర్లుగా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంటే మన కరెన్సీలో రూ. 1.24కోట్లు అన్నమాట.
నీటిపైనా వెళ్లగలదు..
యాంగ్‌వాంగ్ యూ8 ఎస్‌యూవీ కారు ఆన్ రోడ్‌లో మాత్రమే కాదు.. ఆఫ్ ల్యాండ్‌లో కూడా సులభంగా ప్రయాణించగలుగుతుంది. అత్యంత ప్రతికూల పరిస్తితులు తట్టుకునే విధంగా ఈ వెహికల్‌ను రూపొందించినట్లు బీవైడీ సంస్థ ప్రకటించింది. అత్యంత ధృఢంగా దీనిని తయారు చేసినట్లు ప్రకటించింది. దీని బరువే ఏకంగా 3.5 మెట్రిక్ టన్నులు ఉంటుంది. ఈ కారు వరదల్లో చిక్కుకున్నా కూడా ఎంచక్కా తేలిపోతుంది. ఈ ఎస్‌యూవీలోని సస్పెన్షన్స్ ఎలివేట్ అయ్యి.. కారు తెలిపోయేలాచేస్తుంది. ఇంజిన్ ఆగిపోతుంది. హెచ్‌వీఏసీ సిస్టమ్ ఆన్ అవుతుంది. రీ సర్కులేషన్ మోడ్ ప్రారంభమవుతుంది. కారు విండోలు పూర్తిగా మూసుకుపోయి. నీరు లోపలికిరాకుండా చేస్తుంది. ఇలా 30 నిమిషాల పాటు నీటిపై ప్రయాణించే అవకాశం ఈ కారు అందిస్తుంది. దీనిలో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ కారులోని ట్యాంక్ ను 360 డిగ్రీల కోణంలో టర్న్ చేయగలుగుతుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ జీ వాగ్నర్, రేంజ్ రోవర్ వంటి వాటికి ప్రధాన పోటీదారుగా నిలిచే అవకాశం ఉంది. కాగా ఇలా నీటిపై కూడా ప్రయాణించగలిగే కారును ఇంతకుముందే టెస్లా కూడా పరీక్షించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




