AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan: రైతన్నా డబ్బులు పడ్డాయా లేదా? ఇలా చెక్‌ చేసుకోండి..

ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస పత్ర, కిసాన్ సమ్మాన్ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన 16వ విడత నిధులను బుధవారం విడుదల చేశారు. లబ్ధిదారులు తమ పేరు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులను ఉపయోగించి తమ ఖాతాల్లో ఆ సొమ్ములు పడ్డాయో లేదో సరి చూసుకోవచ్చు. ఈ పథకాన్ని 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు.

PM Kisan: రైతన్నా డబ్బులు పడ్డాయా లేదా? ఇలా చెక్‌ చేసుకోండి..
Money
Madhu
|

Updated on: Mar 01, 2024 | 8:53 AM

Share

ప్రభుత్వాలు అన్నదాతకు భరోసా కల్పించేందుకు అనేక పథకాలను అందిస్తున్నాయి. అనేక రకాల సబ్సిడీలు, రుణాలను సైతం మంజూరు చేస్తున్నాయి. ఎటువంటి పరిస్థితి వచ్చిన రైతు ఇబ్బంది ఉండకూడదనే లక్ష్యంతోనే ఈ పథకాలు అమలు చేస్తున్నాయి. వాటిల్లో కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉంటాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస పత్ర, కిసాన్ సమ్మాన్ యోజన వంటి పథకాలను అమలు చేస్తోంది. ఆ పథకాలలో ఒకటైన పీఎం కిసాన్ సమ్మాన్ యోజనకు సంబంధించిన 16వ విడత నిధులను బుధవారం విడుదల చేశారు. లబ్ధిదారులు తమ పేరు, ఆధార్‌ కార్డు, పాన్‌ కార్డులను ఉపయోగించి తమ ఖాతాల్లో ఆ సొమ్ములు పడ్డాయో లేదో సరి చూసుకోవచ్చు. ఈ పథకాన్ని 2019 కేంద్ర మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించారు. అప్పటి నుంచి అమలు చేస్తున్నారు. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో తనిఖీ చేసుకునే విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం..

ఏడాదికి రూ.6000 జమ..

ఈ పథకం కింద లబ్ధిదారులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున మంజూరు చేస్తారు. ఏడాదికి మూడు సార్లు మొత్తం రూ.6000 అందుతాయి. ఏప్రిల్‌ – జూలై, ఆగస్టు – నవంబర్‌, డిసెంబర్‌ – మార్చిలో మూడు సమాన వాయిదాల్లో రైతుల ఖాతాలకు జమచేస్తారు. సాధారణంగా సాగు సమయంలో రైతులకు పెట్టుబడికి ఇబ్బందులు ఎదురవుతాయి. దానికోసం ప్రైవేటు వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు. పంట చేతికొచ్చాక వచ్చిన సొమ్ముల్లో ఎక్కువ శాతం ఆ వడ్డీలకే సరిపోతుంది. ఈ నేపథ్యంలో రైతులకు ఆదుకునేందుకు, వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

ఇలా తనిఖీ చేసుకోండి..

  • పీఎం కిసాన్‌ అధికార వెబ్‌సైట్‌ పీఎంకేఐఎస్‌ఏఎన్‌.జీవోవీ.ఇన్‌ను సందర్శించాలి.
  • హోమ్‌ పేజీలోని బెనిపిషియరీ స్టేటస్‌ ట్యాబ్‌పై క్లిక్‌ చేయాలి.
  • లబ్ధిదారుల స్థితిపై క్లిక్‌ చేయాలి. ఆధార్‌ నంబర్‌, బ్యాంకు ఖాతా, మొబైల్‌ నంబర్‌లలో ఏదో ఒకదానికి ఎంచుకోవాలి.
  • ఆ తర్వాత డేటా పొందండి అనే దానిపై క్లిక్‌ చేయాలి.
  • వెంటనే మీ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

ఏదైనా సందేహం లేదా సహాయం కోసం లబ్ధిదారులు పీఎం కిసాన్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 1555261, 1800115526, 011 – 23381092ను సంప్రదించాలి. లేదా కిసాన్‌ యోజన అధికారిక ఈ మెయిల్‌ పీఎమ్‌కేఐఎస్‌ఏఎన్‌-ఐసీటి@జీవోవీ.ఐఎన్‌ను కూడా సంప్రదించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఫిర్యాదు చేయాలనుకుంటే..

ఈ పథకానికి సంబంధించి ఫిర్యాదులు చేయడానికి హెల్ప్‌లైన్‌ నంబర్లు 011 – 24300606, 155261, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800-115-526కు కాల్‌ చేయాలి. లేదా పీఎంకేఐఎస్‌ఏఎన్‌-ఐసీటి@జీవోవి.ఐఎన్‌ లేదా పీఎంకేఐఎస్‌ఏఎన్‌-ఎఫ్‌యూఎన్‌డీఎస్‌@జీవోవీ.ఐఎన్‌ చిరునామాకు ఈ మెయిల్‌ పంపవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?